IPL 2025 : ఐపీఎల్ 18 సీజన్లో మరో ఉత్కంఠ పోరు. ఆఖరి ఓవర్ థ్రిల్లర్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు లక్నో సూపర్ జెయింట్స్(LSG) ఊహించని షాకిచ్చింది. అవేశ్ ఖాన్(3-37) సంచలన బౌలింగ్‌తో లక్నో 2 పరుగుల తేడాతో గెలుపొందింది. భారీ ఛేదనలో యశస్వీ జైస్వాల్(74), కెప్టెన్ రియాన్ పరాగ్(39).. అరంగేట్రం కుర్రాడు వైభవ్ సూర్యవంశీ(34)లు రాణించినా.. లక్నో బౌలర్లు పుంజుకొని రాజస్థాన్ నుంచి విజయాన్ని లాగేసుకున్నారు.
ఐపీఎల్లో మరో ఉత్కంఠ మ్యాచ్. ఆఖరి ఓవర్ వరకూ ఆసక్తిగా సాగిన పోరులో జయభేరి మోగించింది. అలవోకగా గెలుస్తుందనుకున్న రాజస్థాన్ ఆఖర్లో తడబడి ఓటమి పాలైంది. మొదట ఆడిన లక్నో 180 రన్స్ కొట్టింది. భారీ ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు దంచేశారు. యశస్వీ జైస్వాల్(74) అర్థ శతకంతో చెలరేగాడు. ఈ సీజన్లో ఈ లెఫ్ట్ హ్యాండర్‌కు ఇది మూడో హాఫ్ సెంచరీ. ఇక. 14 ఏళ్లకే అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ(34)సైతం దూకుడుగా ఆడాడు. ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచిన ఈ కుర్రాడు.. అవేశ్ ఖాన్ ఓవర్లో భారీ సిక్సర్ బాదాడు. మొదట మ్యాచ్‌లోనే ఫిఫ్టీ కొట్టేలా కనిపించిన ఈ చిచ్చరపిడుగు అనూహ్యంగా మర్క్రమ్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. దాంతో, 85 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
No mercy for the ball when the batter is Yashasvi Jaiswal 👊
A stylish 5️⃣0️⃣* from him keeps #RR in control with 83/0 after 8.1 overs.
Updates ▶️ https://t.co/02MS6ICvQl#TATAIPL | #RRvLSG | @rajasthanroyals pic.twitter.com/BZZD2T2U7A
— IndianPremierLeague (@IPL) April 19, 2025
ఆ కాసేపటికే నితీశ్ రానా(8)ను యశ్ ఠాకూర్ పెవిలియన్ పంపాడు. ప్రస్తుతం కెప్టెన్ రియాన్ పరాగ్ (15) ఆడుతున్నాడు. 18వ ఓవర్లో యశస్వీని బౌల్డ్ చేసి అవేశ్ చివరి బంతికి పరాగ్‌ను ఎల్బీగా ఔట్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. 12 బంతుల్లో 20 రన్స్ అవసరం కాగా.. ప్రిన్స్ బౌలింగ్‌లో హెట్‌మైర్(12) ఫోర్, 6 కొట్టాడు. 20వ ఓవర్లో 9 రన్స్ అవసరమయ్యాయి. తొలి బంతికి జురెల్ సింగిల్.. ఆ తర్వాత డబుల్స్.. మూడో బంతికి శార్థూల్కు క్యాచ్ ఇచ్చి హెట్‌మైర్ ఔటయ్యాడు. నాలుగో బంతికి యార్కర్ వేసిన అవేశ్ పరుగు ఇవ్వలేదు. ఐదో బంతిని శుభం దూబే(3) గాల్లోకి లేపగా మిల్లర్ జారవిడవడంతో 3 రన్స్ వచ్చాయి. ఆఖరి బంతికి సైతం ఒకటే రన్ రావడంతో లక్నో 2 పరుగుల తేడాతో గెలుపొందింది.
జైపూర్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు చెలరేగారు. ఇన్నింగ్స్ ఆరంభంలో తడబడినా ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ బౌలర్లను ఉతికారేశారు. ఓపెనర్ ఎడెన్ మర్క్రమ్(66), ఇంప్యాక్ట్ ప్లేయర్ ఆయుశ్ బదొని(50)లు ఆదుకున్నారు. క్రీజులో పాతుకుపోయిన ఈ ఇద్దరూ అర్థ శతకాలతో చెలరేగి నాలుగో వికెట్‌కు 76 రన్స్ జోడించి.. భారీ స్కోర్‌కు పునాది వేశారు. ఆఖర్లో అబ్దుల్ సమద్(30 నాటౌట్) నాలుగు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. సందీప్ శర్మ వేసిన 20వ ఓవర్లో ఏకంగా బంతిని నాలుసార్లు స్టాండ్‌లోకి పంపి 27 రన్స్ పిండుకున్నాడు. దాంతో, లక్నో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.
Innings Break!
Fifties from Aiden Markram & Ayush Badoni whereas Abdul Samad’s late cameo give #LSG a strong finish! 💪
Will #RR chase this down?
Updates ▶️ https://t.co/02MS6ICvQl#TATAIPL | #RRvLSG pic.twitter.com/qwHpniFQNR
— IndianPremierLeague (@IPL) April 19, 2025