Avesh Khan: రెండో టెస్టుకు షమీ స్థానంలో అవేశ్ ఖాన్
Avesh Khan: అవేశ్ ఖాన్ను రెండో టెస్టుకు తీసుకున్నారు. షమీ స్థానంలో అతనికి ఛాన్స్ ఇస్తున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. జనవరి మూడవ తేదీ నుంచి రెండో టెస్టు ప్రారంభంకానున్నది.
సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో జరగాల్సిన రెండో టెస్టుకు భారత జట్టులో మార్పు చేశారు. పేస్ బౌలర్ మహమ్మద్ షమీ స్థానంలో అవేశ్ ఖాన్(Avesh Khan)ను తీసుకున్నారు. జనవరి 3వ తేదీ నుంచి కేప్టౌన్లో ఆ మ్యాచ్ జరగనున్నది. తొలి టెస్టులో ఇండియా దారుణంగా ఓడింది. ఇన్నింగ్స్ 32 రన్స్ తేడాతో భారత్ పరాభవం చెందిన విషయం తెలిసిందే. వాస్తవానికి తొలి టెస్టులో షమీ ఆడలేదు. కానీ తొలుత రెండో టెస్టుకు అతన్ని ఎంపిక చేశారు. అయితే అనివార్య కారణాల వల్ల అతను ఇంకా జట్టుతో కలవలేదు. దీంతో షమీ స్థానంలో అవేశ్ ఖాన్కు చోటు కల్పిస్తున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది.
రెండో టెస్టు కోసం బీసీసీఐ ప్రకటించిన భారత బృందం ఇదే : రోహిత్ శర్మ్(కెప్టెన్), శుభమన్ గిల్, జైస్వాల్, కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అశ్విన్, జడేజా, శార్దూల్, సిరాజ్, ముకేశ్, బుమ్రా, ప్రసిద్ధ కృష్ణ, కేఎస్ భరత్, అభిమన్యు ఈశ్వరన్, అవేశ్ ఖాన్.
🚨 NEWS 🚨
Avesh Khan added to India’s squad for 2nd Test.
Details 🔽 #TeamIndia | #SAvINDhttps://t.co/EsNGJAo8Vl
— BCCI (@BCCI) December 29, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Avesh Khan
- India
- Test Match
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

