మెల్బోర్న్: సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పోలండ్ భామ ఇగా స్వియాటెక్ జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్ పోరులో రెండో సీడ్ స్వియాటెక్ 6-1, 6-0తో ఎమ్మా రదుకాన్(బ్రిటన్)పై అలవోక విజయం సాధించింది. గంటా 10 నిమిషాల పాటు జరిగిన పోరులో స్వియాటెక్ కండ్లు చెదిరే షాట్లతో చెలరేగింది. బలమైన ఫోర్‌హ్యాండ్, బ్యాక్‌హ్యాండ్ షాట్లకు తోడు దీటైన సర్వ్‌లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది.
మ్యాచ్ మొత్తమ్మీద స్వియాటెక్ రెండు ఏస్‌లు, మూడు డబుల్ ఫాల్ట్స్, 24 విన్నర్లు కొట్టింది. 12సార్లు అవనసర తప్పిదాలు చేయగా, 12 బ్రేక్ పాయింట్లలో ఐదింటిని కాపాడుకుంది. మిగతా మ్యాచ్‌ల్లో నవారో 6-4, 3-6, 6-4తో జుబెర్‌పై, రిబకినా 6-3, 6-4తో డయానా యస్ట్రేమస్కాపై, స్వితోలినా2-6, 6-4, 6-0తో పౌలినిపై, మాడిసన్ కీస్ 6-4, 6-4తో కొలిన్స్‌పై, కసాట్కినా 7-5, 6-1తో పుతినెత్సెవాపై గెలిచి ముందంజ వేశారు. పురుషుల విభాగంలో టేలర్ ఫ్రిట్జ్ 6-3, 5-7, 6-7(1/7), 4-6తో మోన్ఫిల్స్ చేతిలో ఓడిపోయాడు. జానిక్ సినర్ర 6-3, 6-4, 6-2తో గిరోన్‌పై గెలిచాడు.