మెల్బోర్న్: సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నయా చాంపియన్ దూసుకొచ్చింది. అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఏకైక టైటిల్ ఎగరేసుకుపోయింది. మ్యాచ్ మ్యాచ్‌కు రాటుదేలుతూ తన కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను ముద్దాడిన ఆ అమ్మాయే అమెరికా స్టార్ మాడిసన్ కీస్. శనివారం ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో కీస్ 6-3, 2-6, 7-5తో డిఫెండింగ్ చాంపియన్ అరీనా సబలెంక(బెలారస్)కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.
ముచ్చటగా మూడోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలుద్దామనుకున్న సబలెంక ఆశలపై నీళ్లు గుమ్మరిస్తూ కీస్ సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంది. రెండు గంటల రెండు నిమిషాల పాటు సాగిన తుది పోరులో ఫెవరేట్‌గా బరిలోకి దిగిన సబలెంకకు కీస్ దీటైన పోటీనిచ్చింది. 6-3తో తొలి సెట్‌ను కైవసం చేసుకున్న కీస్..రెండో సెట్‌ను చేజార్చుకుంది. అయితే ఎక్కడా ఆత్మవిశ్వాస ం కోల్పోని ఈ అమెరికా స్టార్ బలమైన బేస్గేమ్తో చెలరేగింది. మ్యాచ్‌లో ఆరు ఏస్‌లు కొట్టిన కీస్ ఒక డబుల్ ఫాల్ట్ కూడా చేయలేదు. అదే సమయంలో 29 విన్నర్లతో పాటు 4బ్రేక్ పాయింట్లను కాపాడుకుంది.
కీస్ నుంచి ఇంతటి పోటీని ఊహించని సబలెంక నాలుగు డబుల్ ఫాల్ట్స్, 13సార్లు అనవసర తప్పిదాలు చేసింది. ఒక దశలో సహనం కోల్పోయిన ఈ ప్రపంచ నంబర్‌వన్ నెట్ వద్ద తప్పులు మూల్యం చెల్లించుకుంది. 29 ఏండ్ల వయసులో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన కీస్‌కు ఇది 46వ స్లామ్ మ్యాచ్. పెన్నెట్టా(49), మరియన్ బర్తోలి(47) తర్వాత ఎక్కువ మ్యాచ్‌లు ఆడి టైటిల్ గెలిచిన ప్లేయర్‌గా కీస్ నిలిచింది. దీనికి తోడు ప్లావియా పెనెట్టా(33 ఏండ్లు) తర్వాత గ్రాండ్‌స్లామ్ గెలిచిన ప్లేయర్‌గాను గుర్తింపు పొందింది.