బ్రిస్బేన్: ఆస్ట్రేలియా పేస్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్(Josh Hazlewood) మళ్లీ గాయపడ్డాడు. దీంతో అతను భారత్‌తో జరిగే మిగితా రెండు టెస్టులకు దూరంకానున్నాడు. కుడి కాలుకు చెందిన పిక్క కండరాల్లో నొప్పి వస్తోంది. దీని వల్ల ప్రస్తుత టెస్టుతో పాటు రాబోయే రెండు టెస్టులకు కూడా హేజిల్‌వుడ్ దూరం కానున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తన ప్రెస్ రిలీజ్లో పేర్కొన్నది. టెస్టు సిరీస్‌కు దూరం అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో.. అతని స్థానంలో మరో బౌలర్‌కు చోటు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. వార్మప్ సమయంలో హేజిల్‌వుడ్ కండరాలకు గాయమైంది. నాలుగవ రోజు కేవలం ఒక్క ఓవర్ మాత్రమే వేశాడు.
అడిలైడ్‌లో గాయం వల్ల ఆడలేకపోయిన హేజిల్‌వుడ్.. బ్రిస్బేన్‌లో ఆడినా మళ్లీ అతనికి గాయమైంది. పిక్క కండరాలకు గాయం వల్ల అతను సిరీస్‌కు దూరం అయ్యే ప్రమాదం ఉన్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. త్వరలో అతని స్థానంలో కొత్త బౌలర్‌ను ప్రకటించనున్నట్లు సీఏ పేర్కొన్నది. అడిలైడ్ టెస్టులో హేజిల్‌వుడ్ స్థానంలో ఆడిన స్కాట్ బోలాండ్.. మళ్లీ ఆసీస్ జట్టులో చేరే ఛాన్సున్నది. బాక్సింగ్ డే టెస్టుకు అతను అందుబాటులో ఉండనున్నాడు.
Josh Hazlewood appears set to miss the rest of the #AUSvIND Test series: https://t.co/c4KzFBMBCI pic.twitter.com/vEC6Qe6gWs
— cricket.com.au (@cricketcomau) December 17, 2024