Team India Vs Australia | టీం ఇండియాతో గుజరాత్లోని రాజ్ కోట్ లో జరుగుతున్న చివరి వన్డే మ్యాచ్లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 353 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన రోహిత్ సేనను ఆస్ట్రేలియా మరో రెండు బంతులు మిగిలి ఉండగానే 286 పరుగులకు ఆలౌట్ చేసింది. మొదటి రెండు వన్డే మ్యాచ్ లు గెలుచుకున్న టీం ఇండియా.. మూడు వన్డేల సిరీస్ ను 2-1 తేడాతో సొంతం చేసుకున్నది.
353 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీం ఇండియా బ్యాటర్లలో రోహిత్ శర్మ 81, విరాట్ కోహ్లీ 56, శ్రేయాస్ అయ్యర్ 48, రవీంద్ర జడేజా 35, కేఎల్ రాహుల్ 26 పరుగులు చేశారు. ఓపెనర్ వాషింగ్టన్ సుందర్, సూర్య కుమార్ యాదవ్, కుల్ దీప్ యాదవ్ వంటి వారు తేలిపోయారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రెండో వికెట్ భాగస్వామ్యానికి 70 పరుగులు జత చేశారు. కోహ్లీ తర్వాత వెంటవెంటనే ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ దారి పెట్టడంతో 49.4 ఓవర్లకే 286 పరుగులు చేసి టీం ఇండియా ఆలౌట్ అయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 352 పరుగులు చేసింది.