టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ 2కు తెర లేచింది. పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య కొద్దిసేపట్లో పోరు ప్రారంభం కానుంది. దుబాయ్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో పాకిస్థాన్ ముందు బ్యాటింగ్ చేయనుంది.
నిన్న జరిగిన మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ మీద న్యూజిలాండ్ గెలిచిన విషయం తెలిసిందే. ఈరోజు మ్యాచ్‌లో గెలిచిన టీమ్.. నవంబర్ 14న న్యూజిలాండ్‌తో ఫైనల్ మ్యాచ్‌లో తలపడనుంది.
పాకిస్థాన్ జట్టు నుంచి బాబర్ ఆజమ్(కెప్టెన్), మహమ్మద్ రిజ్వాన్, ఫఖర్ జమాన్, మహమ్మద్ హఫీజ్, సోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, ఇమాద్ వాసిమ్, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిదీ, హరిశ్ రవుఫ్ బరిలో ఉన్నారు.
ఆస్ట్రేలియా నుంచి డేవిడ్ వార్నర్, ఆరున్ ఫించ్(కెప్టెన్), మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టొయినిస్, మాథ్యు వేడ్(వికెట్ కీపర్), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్ బరిలో ఉన్నారు.
Toss news from Dubai 📰
— T20 World Cup (@T20WorldCup) November 11, 2021
Australia have won the toss and elected to field.
Who are you backing in this one? #T20WorldCup | #PAKvAUS | https://t.co/W7izrV7PAI pic.twitter.com/S7FwrBCdRg