టీ20 వరల్డ్ కప్ 2021 ఫైనల్స్‌కు తెర లేచింది. ఇంకొద్దిసేపట్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ పోరు ప్రారంభం కానుంది. ఈనేపథ్యంలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
అందరూ ఊహించినట్టుగానే టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా టీమ్ నుంచి డేవిడ్ వార్నర్, ఆరున్ ఫించ్(కెప్టెన్), మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టొయినిస్, మాథ్యూ వేడ్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హజిల్‌వుడ్ బరిలో ఉన్నారు.
న్యూజిలాండ్ టీమ్ నుంచి మార్టిన్ గప్టిల్, మిచెల్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), ఫిలిప్స్, టిమ్ సైఫెర్ట్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంత్నర్, ఆడమ్ మిల్నే, టిమ్ సౌథీ, ఇష్ సోదీ, ట్రెంట్ బౌల్ట్ బరిలో ఉన్నారు.
వీళ్లే కీలకం..
అంచనాల్లేకుండా తుదిపోరుకు అర్హత సాధించిన ఇరు జట్లలోనూ మ్యాచ్ విన్నర్లకు కొదవ లేకున్నా.. ఉత్కంఠభరిత మ్యాచ్‌ల్లో ఒత్తిడిని జయించడం బాగా అలవాటైన ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్‌ను కివీస్ బౌలర్లు ఎలా నిలువరిస్తారనేది ఆసక్తి రేపుతున్నది. ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీతో పాటు తుది జట్టులో చోటు కోల్పోయిన డేవిడ్ వార్నర్ ఆ కసినంతా ఈ టోర్నీలో కనబరుస్తున్నాడు. మరో ఓపెనర్ ఫించ్ వరుసగా విఫలమవుతున్నా.. ఆ ప్రభావం జట్టు మీద పడలేదంటే అందుకు వార్నర్ దూకుడే కారణం. ఇప్పటి వరకు టోర్నీలో 148.42 స్ట్రయిక్ రేట్‌తో 236 పరుగులు చేసిన డేవిడ్ భాయ్ అత్యధిక పరుగుల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. అతడితో పాటు పాక్‌తో సెమీస్‌లో వీరవిహారం చేసిన స్టొయినిస్, మాథ్యూ వేడ్ మరోసారి కీలకం కానుండగా.. స్మిత్ మునుపటి జోరు కనబర్చాలని చూస్తున్నాడు. కివీస్ కెప్టెన్ విలియమ్సన్ ఈ టోర్నీలో బ్యాట్‌తో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. వనరులను సమర్థవంతంగా వినియోగించడంలో కేన్ విజయవంతమయ్యాడు. గప్టిల్, మిచెల్, నీషమ్‌పై కివీస్ బ్యాటింగ్ ఎక్కువగా ఆధారపడి ఉంది. టోర్నీలోనే అత్యుత్తమ పేస్ దళం అందుబాటులో ఉండటం న్యూజిలాండ్‌కు కలిసొచ్చే అంశం కాగా.. శాంట్నర్, సోధి రూపంలో ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లు ఉండటం అదనపు బలం.
పడిగాపులు కాయాల్సిందే..
తమ జాతీయ జట్లు ప్రపంచకప్ ఫైనల్లో తలపడుతుంటే.. ఆ మ్యాచ్ చూసేందుకు స్వదేశంలో అభిమానులంతా కాలంతో కుస్తీ పట్టాల్సిన పరిస్థితి నెలకొంది. భారత కాలమానం ప్రకారం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య ఆదివారం రాత్రి 7.30 గంటలకు ఫైనల్ ప్రారంభం కానుండగా.. ఆ సమయంలో ఆస్ట్రేలియాలో అర్ధరాత్రి ఒంటిగంటా.. న్యూజిలాండ్‌లో సోమవారం తెల్లవారుజామను 3 గంటల సమయం అవుతుండటమే దీనికి ప్రధాన కారణం.
Toss news from Dubai 🪙
— ICC (@ICC) November 14, 2021
Australia have won the toss and elected to field.
Which team is walking away with the 🏆? #T20WorldCup | #T20WorldCupFinal | #NZvAUS | https://t.co/50horpfG97 pic.twitter.com/euCvrMQ4IV
Here's how both the teams line up 📝
— ICC (@ICC) November 14, 2021
Australia have gone with an unchanged side, while New Zealand make 1⃣ change. #T20WorldCup | #T20WorldCupFinal | #NZvAUS | https://t.co/50horpfG97 pic.twitter.com/AveavC0fLi
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
T20 World Cup Final : ఇది వాళ్ల టైమ్.. ఆ జట్టే గెలుస్తుంది.. టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్‌పై గంగూలీ
T20 World Cup Final : 30 పరుగులు చేస్తే చాలు.. ఆసీస్‌కు మరో రికార్డు అందించబోతున్న వార్నర్
T20 World Cup Final : ఈమ్యాచ్‌లోనూ టాసే కీలకం.. టాస్ గెలిచిన జట్టుదే ట్రోఫీ.. కారణం ఇదే
T20 World Cup Final : ఈసారి ట్రోఫీ ఆ జట్టుకేనట.. ఎలాగో కూడా చెప్పేసిన నెటిజన్లు
ఆసీస్, కివీస్ ఎన్నిసార్లు టీ20లలో పోటీపడ్డాయి? ఏ టీమ్ ఎక్కువసార్లు గెలిచింది?
VVS Laxman | జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్