బ్రిస్బేన్: బ్రిస్బేన్‌లో జరుగుతున్న మూడవ టెస్టులో( AUSvIND).. మూడవ రోజు ఆస్ట్రేలియా పై చేయి సాధించింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో తొలుత 445కు ఆలౌటైన ఆస్ట్రేలియా.. ఆ తర్వాత ఇండియన్ టాప్ ఆర్డర్‌ను ఇబ్బందిపెట్టింది. వర్షం వల్ల ఆట నిలిచిపోయే సమయానికి ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయి 51 రన్స్ చేసింది. ఆసీస్ పేస్ అటాక్ ముందు.. భారత బ్యాటర్లు చేతులెల్తేశారు. జైస్వాల్ 4, గిల్ 1, కోహ్లీ 3, పంత్ 9 రన్స్ చేశారు.
The play has been called off due to bad light and it will be Stumps on Day 3 in Brisbane.#TeamIndia 51/4 in the 1st innings
Scorecard – https://t.co/dcdiT9NAoa#AUSvIND pic.twitter.com/bGpw7giCSS
— BCCI (@BCCI) December 16, 2024
అంతకముందు ఆస్ట్రేలియా ఇవాళ ఉదయం 40 రన్స్ జోడించి 445 రన్స్‌కు ఆల్ అవుట్ అయ్యింది. భారత బౌలర్లలో బుమ్రా అద్భుతంగా బౌల్ చేశాడు. 76 రన్స్ ఇచ్చి అతను ఆరు వికెట్లు తీసుకున్నాడు. ఆసీస్ బ్యాటర్ అలెక్స్ క్యారీ 88 బంతుల్లో 70 రన్స్ చేశాడు. ఆసీస్ బ్యాటర్లలో స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్.. సెంచరీలు చేసిన విషయం తెలిసిందే. రెండో సెషన్లో వర్షం రావడంతో ఆట నిలిచిపోయింది. మళ్లీ ట్రీ బ్రేక్ తర్వాత కేవలం 17 బంతులే ఆడిన తర్వాత వర్షం వచ్చింది. లైట్ కూడా డిమ్‌గా ఉండడంతో.. ఆటను రద్దు చేశారు.
భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ ఒక్కడే స్థిరంగా ఆడాడు. ఆస్ట్రేలియా పేస్ అటాక్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. మిగితా టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఎవరూ క్రీజ్‌లో నిలదొక్కుకోలేకపోయారు. మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్ వేగం ముందు భారత బ్యాటర్లు తేలిపోయారు. మేటి బ్యాటర్ కోహ్లీ కూడా ఈజీగా చిక్కేశాడు. భారత్ ఇంకా 394 పరుగులు వెనుకబడి ఉన్నది.