అడిలైడ్: ఆస్ట్రేలియా యువ స్విమ్మర్ జాక్ స్టబ్లె కుక్ ప్రపంచ రికార్డుతో అదరగొట్టాడు. గురువారం జరిగిన ఆస్ట్రేలియా స్విమ్మింగ్ చాంపియన్‌షిప్ పురుషుల 200మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్ విభాగంలో బరిలోకి దిగిన కుక్ ..2:05: 95 సెకన్ల టైమింగ్‌తో ముగించాడు. గతం(2019)లో గ్వాంగ్జులో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రష్యా స్విమ్మర్ అంటోన్ చుప్కోవ్ నెలకొల్పిన రికార్డు(2:06:12సె)ను కుక్ తాజాగా తిరుగరాశాడు.
టోక్యో(2020)లో ఒలింపిక్ రికార్డుతో స్వర్ణ పతకం కొల్లగొట్టిన జాక్ తాజా ప్రదర్శనపై స్పందిస్తూ ‘ఇది నమ్మశక్యంగా లేకుండా ఉంది. ప్రపంచ రికార్డు ప్రదర్శన కనబరుస్తానని అనుకోలేదు. వేగంగా ఈదుతూ అత్యుత్తమంగా రాణించాలనుకున్నా’అని జాక్ సంతోషం వ్యక్తం చేశాడు.