Australia | ఆక్లాండ్: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్‌పై టీ20 సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన చివరిదైన మూడో మ్యాచ్‌లో ఆసీస్ 27 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్) కివీస్‌ను చిత్తుచేసింది. తొలుత ఆసీస్ 10.4 ఓవర్లలో 4 వికెట్లకు 118 రన్స్ కొట్టింది. హెడ్ (33), షార్ట్ (27) రాణించారు. అనంతరం లక్ష్యఛేదనలో కివీస్ 3 వికెట్లు కోల్పోయి 98 పరుగులకు పరిమితమైంది. గ్లెన్ ఫిలిప్స్ (40) పోరాడినా ఫలితం లేకపోయింది.