పెర్త్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న పెర్త్ టెస్టులో(AUSvIND).. భారత బౌలర్లు దుమ్మురేపుతున్నారు. బౌన్సీ పిచ్‌పై భారత స్పీడ్ బౌలర్లు చెలరేగిపోతున్నారు. ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో.. 17 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయింది. ఆసీస్ టాపార్డర్ దారుణంగా విఫలమైంది. ఇప్పటికే బుమ్రా 3 వికెట్లు తీయగా, హర్షిత్ రాణా, సిరాజ్‌లు చెరో వికెట్ తీసుకున్నారు. ఓ దశలో కెప్టెన్ బుమ్రా హ్యాట్రిక్ ఛాన్స్ మిస్సయ్యాడు. ప్రస్తుతం క్రీజ్‌లో లబుషేన్, కేరీ ఉన్నారు.
🔥🔥
Boom boom Bumrah!
Back to back wickets for the Skipper 🫡🫡
Usman Khawaja and Steve Smith depart!
Live – https://t.co/gTqS3UPruo…… #AUSvIND pic.twitter.com/Y1qtGQlCWB
— BCCI (@BCCI) November 22, 2024
ఇండియాన తన ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 150 రన్స్‌కు ఆలౌటైన విషయం తెలిసిందే. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ 26, రిషబ్ పంత్ 37, నితీశ్ కుమార్ రెడ్డి 41 రన్స్ చేశారు. తాజా సమాచారం ప్రకారం ఆస్ట్రేలియా 19 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 42 రన్స్ చేసింది.