లండన్ : మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆరుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియా రికార్డు స్థాయిలో ఏడోసారి ఈ టోర్నీ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఓవల్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన ఏకపక్ష మ్యాచ్‌లో కంగారూలు.. 8 వికెట్ల తేడాతో ప్రత్యర్థిని మట్టికరిపించారు.
మ్యాచ్‌లో మొదట విండీస్.. 20 ఓవర్లకు 125/7కే పరిమితమవగా ఛేదనను ఆసీస్.. 13 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి పూర్తిచేసింది. మొదట బంతితో విండీస్‌ను కట్టడిచేసిన ఆష్లీ గార్డ్నర్ (2/13) తర్వాత బ్యాట్ (35 నాటౌట్)తోనూ సత్తాచాటింది. బెత్ మూనీ (61 నాటౌట్) అర్ధ సెంచరీ సాధించింది.