పెర్త్: యాషెస్ సిరీస్ తొలి టెస్టు(Aus Vs Eng)లో ఆస్ట్రేలియాకు 205 పరుగుల లక్ష్యాన్ని విసిరింది ఇంగ్లండ్. రెండో రోజు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 164 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ 4 వికెట్లు తీసుకోగా.. స్టార్క్, డగ్గెట్ మూడేసి వికెట్లు తీసుకున్నారు. వాస్తవానికి ఇవాళ తొలి సెషన్లో ఇండ్లండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లంచ్ సమయానికి 59 రన్స్ చేసింది.
కానీ భోజన విరామం తర్వాత సీన్ మారింది. ఆస్ట్రేలియా పేస్ బౌలర్లు హడలెత్తించారు. బోలాండ్, స్టార్క్‌లు వరుసగా వికెట్లు తీశారు. రెండో సెషన్లో కేవలం 105 రన్స్ మాత్రమే జోడించి ఇండ్లండ్ 9 వికెట్లను కోల్పోయింది. అయితే గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆ ఇద్దరూ 8వ వికెట్‌కు 35 బంతుల్లో 50 రన్స్ జోడించారు. ఇంగ్లండ్‌కు కీలక భాగస్వామ్యాన్ని అందించారు.
ఆసీస్ బౌలర్ స్టార్క్ ఈ మ్యాచ్‌లో మొత్తం తన ఖాతాలో పది వికెట్లు వేసుకున్నాడు. ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 172 రన్స్ చేయగా, ఆస్ట్రేలియా 132 రన్స్ చేసింది.