ODI World Cup | వరల్డ్ కప్ – 2023 టోర్నీలో సౌతాఫ్రికా- ఆస్ట్రేలియా మధ్య గురువారం జరుగుతున్న మ్యాచ్లో ఆస్ట్రేలియా ఓపెనర్లిద్దరి వికెట్లు కోల్పోయింది. తొలుత ఆరో ఓవర్లో మాక్రో జన్సన్ వేసిన ఐదో బంతి ఎడ్జ్ లో ఉన్న బవుమా చేతిలోకి వెళ్లి పడింది. దీంతో బ్యాటింగ్ చేస్తున్న మిచెల్ మార్ష్ ఏడు పరుగులకే ఔటయ్యాడు. తర్వాత ఏడో ఓవర్ నిగిడి వేసిన చివరి బంతిని ఆడుతున్న డేవిడ్ వార్నర్ కొట్టిన చివరి బంతిని వాన్ డీర్ డసన్ క్యాచ్ పట్టడంతో రెండో వికెట్ రూపం కోల్పోయింది. అప్పటికి ఆయన వ్యక్తిగత స్కోర్ ఏడు పరుగులు మాత్రమే.