ODI World Cup | సౌతాఫ్రికాతో లక్నోలో గురువారం జరుగుతున్న మ్యాచ్లో 312 పరుగలు విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా వెంటవెంటనే నాలుగు వికెట్లు కోల్పోయింది. 12వ ఓవర్ మొదటి బంతికి జోస్ ఇగ్నిష్ రూపంలో నాలుగో వికెట్ను కోల్పోయింది. 14 ఓవర్లు పూర్తయ్యే నాటికి నాలుగు వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది.
అంతకుముందు 10వ ఓవర్లో రబడా వేసిన చివరి బంతిని ఆడిన స్టీవెన్ స్మిత్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. తొలుత ఆరో ఓవర్లో మాక్రో జన్సన్ వేసిన ఐదో బంతి ఎడ్జ్ లో ఉన్న బవుమా చేతిలోకి వెళ్లి పడింది. దీంతో బ్యాటింగ్ చేస్తున్న మిచెల్ మార్ష్ ఏడు పరుగులకే ఔటయ్యాడు. తర్వాత ఏడో ఓవర్ నిగిడి వేసిన చివరి బంతిని ఆడుతున్న డేవిడ్ వార్నర్ కొట్టిన చివరి బంతిని వాన్ డీర్ డసన్ క్యాచ్ పట్టడంతో రెండో వికెట్ రూపం కోల్పోయింది.