విజయ్ రాజ్‌కుమార్, వేణిరావు, సాయిప్రసన్న, అఖిల్ జాక్సన్, శ్రీరామ మండవ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘డెలులు’. ప్రీతం కస్తూరి దర్శకత్వంలో సంకీర్త్ కొండ నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ‘ఫోన్లో పదినిమిషాలు మాత్రమే కథ విని, ఈ సినిమా చేసేందుకు ముందుకొచ్చారు నిర్మాత సంకీర్త్ కొండ.
ఇప్పటివరకూ ఎవరూ సాహసించని కథని ‘డెలులు’లో చెప్పబోతున్నాం. ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చే సినిమా ఇది. ఈ సినిమాకు అంతా ప్రాణం పెట్టి పనిచేశారు. డైరెక్టర్ తొలి సినిమా అయినా గొప్ప ప్రతిభ కనపరిచారు. త్వరలోనే ‘డెలులు’ ప్రేక్షకుల ముందుకు రానున్నది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది’ అని హీరో విజయ్ రాజ్‌కుమార్ నమ్మకం వెలిబుచ్చారు. ఇంకా దర్శకుడు ప్రీతం కస్తూరి, హీరోయిన్లు వేణిరావు, సాయి ప్రసన్న, నటులు అఖిల్ జాక్సన్, ‘జిగ్రీస్’ఫేం కృష్ణ, ‘సీక్రెట్ సోల్జర్స్’ దర్శకుడు అక్కి విశ్వనాథరెడ్డి కూడా మాట్లాడారు.