సిటీబ్యూరో: తెలంగాణ మలిదశ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన కూకట్పల్లి షంషీగూడ ప్రాంతానికి చెందిన ఉద్యమకారుడు లక్ష్మణ్ ముదిరాజ్ క్యాన్సర్తో పోరాడుతున్నారనే విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ చేసి మాట్లాడి ధైర్యం చెప్పారు. పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుందని, అధైర్యపడవద్దని భరోసా నిచ్చారు. కేటీఆర్ ఆదేశాల మేరకు టీఎస్టీఎస్ మాజీ చైర్మన్ పాటిమీది జగన్మోహన్రావు లక్ష్మణ్ ఇంటికి వెళ్లారు.
లక్ష్మణ్ ను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా తక్షణ ఆర్థిక సాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. మెరుగైన వైద్యం అందించేందుకు పార్టీ పరంగా పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు.