AUSW vs SAW : ప్రపంచ కప్‌లో సెమీఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియా(Australia)ను ఓడించి ఆత్మవిశ్వాసం కూడగట్టుకోవాలనుకున్న దక్షిణాఫ్రికా(South Africa) ఆశలు అడియాశలయ్యాయి. టోర్నీలో అజేయంగా దూసుకెళ్తున్న ఆసీస్.. సమఉజ్జీగా భావిస్తున్న సఫారీ టీమ్‌ను చివరి లీగ్ మ్యాచ్‌లో చిత్తుగా ఓడించింది. ఇండోర్‌లో ఏకపక్షంగా సాగిన పోరులో అలనా కింగ్(7-18) సంచలన బౌలింగ్‌తో ప్రతర్థిని కుప్పకూల్చింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని 17వ ఓవర్లోనే ఛేదించింది ఆసీస్. బేత్ మూనీ(42) ఔటైనా.. సథర్లాండ్(10 నాటౌట్) రెండు ఫోర్లు బాదడంతో ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది కంగారూ టీమ్. ఈ విజయంతో 13 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానం కాపాడుకున్న ఆస్ట్రేలియా తొలి సెమీస్‌లో భారత్‌ను ఢీకొట్టనుంది.
ప్రపంచకప్ తుది అంకానికి చేరిన వేళ.. టేబుల్ టాపర్ ఎవరయ్యేను? టీమిండియాతో తలపడేది ఎవరు? అని అందరిలో నెలకొన్న ఉత్కంఠను పటాపంచలు చేసింది మాజీ ఛాంపియన్. శనివారం ఇండోర్ మైదానంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా పోరు ఏకపక్షంగా ముగిసింది. ఐదేసి విజయాలతో జోరుమీదున్న ఇరుజట్ల మధ్య హోరాహోరీ మ్యాచ్ జరుగుతుందని అనుకున్న ఫ్యాన్స్‌కు నిరాశను మిగిల్చింది ఆసీస్. టాస్ గెలిచి సఫారీలను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన ఆస్ట్రేలియా.. అలనా కింగ్(7-18) కెరీర్ బెస్ట్ బౌలింగ్‌తో చెలరేగడంతోప్రత్యర్థిని 97కే ఆలౌట్ చేసింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని 16.5 ఓవర్లలోనే ఉఫ్‌మని ఊదేసింది ఆసీస్.
𝐀𝐮𝐬𝐭𝐫𝐚𝐥𝐢𝐚 𝐜𝐨𝐧𝐟𝐢𝐫𝐦 𝐭𝐡𝐞 𝐭𝐨𝐩-𝐬𝐩𝐨𝐭! 🙌
𝐒𝐨𝐮𝐭𝐡 𝐀𝐟𝐫𝐢𝐜𝐚: 𝟗𝟕/𝟏𝟎 (𝟐𝟒)
Laura Wolvaardt – 31 (26)
Sinalo Jafta – 29 (17)
Alana King – 7/18 (7)𝐀𝐮𝐬𝐭𝐫𝐚𝐥𝐢𝐚: 𝟗𝟖/𝟑 (𝟏𝟔.𝟓)
Beth Mooney – 42 (41)
Georgia Voll – 38* (38)
Marizanne Kapp -… pic.twitter.com/v1GwxmCv4E— Female Cricket (@imfemalecricket) October 25, 2025
ఛేదనలో ఆరంభంలోనే డేంజరస్ ఓపెనర్ ఫొబే లిచ్‌ఫీల్డ్(5)ను ఔట్ చేసి మరినే కాప్ బ్రేకిచ్చింది. ఆ తర్వాతి ఓవర్లోనే ఎలీసా పెర్రీ(0) డకౌట్ కాగా 11 పరుగులకే రెండు వికెట్లు పడ్డాయి. అయితే. సఫారీల ఉత్సాహంపై నీళ్లు చల్లుతూ బేత్ మూనీ(42), జార్జియా వోల్(38 నాటౌట్) దూకుడుగా ఆడారు. బౌండరీలతో విరుచుకుపడిన ఈ ద్వయం మూడో వికెట్‌కు 76 రన్స్ జోడించి జట్టును గెలుపు వాకిట నిలిపారు. అర్ధ శతకానికి చేరువైన మూనీని డీక్లెర్క్ పెవిలియన్ పంపింది. ఆ తర్వాత వచ్చిన అనాబెల్ సథర్లాండ్(10 నాటౌట్) సైతం ధనాధన్ ఆడడంతో ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది ఆసీస్.
All Australia in Indore 🇦🇺 pic.twitter.com/Cy0v10bgAo
— ESPNcricinfo (@ESPNcricinfo) October 25, 2025
చివరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు కనీసం పోటీ ఇవ్వలేకపోయింది దక్షిణాఫ్రికా. స్పిన్నర్ అలనా కింగ్(7-18) తిప్పేయగా.. బ్యాటర్లు సమిష్టిగా విఫలమవ్వడంతో స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. కెప్టెన్ లారా వొల్వార్డ్త్(31)ను ఔట్ చేసిన మేగన్ షట్ తొలి వికెట్ అందించగా.. ఫామ్‌లో ఉన్న తంజిమ్ బ్రిట్స్(6)ను కిమ్ గార్త్ పెవిలియన్ చేర్చింది. అక్కడి నుంచి అలనా కింగ్ సఫారీలను దెబ్బకొడుతూ వచ్చింది. తొలుత.. సునే లుస్(6)ను ఔట్ చేసిన తను.. అనెరీ డిర్కెసెన్(5), గత మ్యా్చ్లో హాఫ్ సెంచరీ బాదిన మరినే కాప్(0), సినాలో జఫ్తా(29), చ్లో ట్రయాన్(0), నడినే డీక్లెర్క్(14), మసబత క్లాస్(4)లను ఔట్ చేసి.. ఏడో వికెట్ సాధించింది. కింగ్ విజృంభణతో 24 ఓవర్లలోనే దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసింది.