సిడ్నీ: వచ్చే నెలలో లార్డ్స్‌లో జరగనున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్(World Test Championship) కోసం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ప్లేయర్లను ప్రకటించింది. బ్యాటర్ సామ్ కోన్స్టాస్కు స్థానం కల్పించారు. స్పిన్నర్ మాట్ కుహనేమాన్, సౌత్ ఆస్ట్రేలియా స్పీడ్ బౌలర్ బ్రెండన్ డగెట్ కూడా ట్రావెల్ రిజర్వ్ ప్లేయర్ల జాబితాలో ఉన్నారు. మొత్తం 16 మంది సభ్యులు ఉన్న బృందాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా మంగళవారం ప్రకటించింది. లార్డ్స్‌లో జరగనున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో సౌతాఫ్రికాతో ఆస్ట్రేలియా తలపడుతుంది. ఆ మ్యాచ్ ముగిసిన తర్వాత వెస్టిండీస్ టూర్‌కు ఆసీస్ వెళ్తుంది. అక్కడ జూన్, జూలై నెలల్లో మూడు టెస్టుల మ్యాచ్‌ల సిరీస్ ఉంటుంది.
ఆస్ట్రేలియా జట్టుకు ప్యాట్ కమ్మిన్స్ కెప్టెన్‌గా మళ్లీ బాధ్యతలు చేపట్టనున్నాడు. శ్రీలంకతో జరిగిన టూరులో కెప్టెన్సీ నుంచి దూరంగా ఉన్న అతను ఇప్పుడు మళ్లీ ఆ రోల్ పోషించనున్నాడు. తోటి టెస్టు క్రికెటర్లు జోష్ హేజిల్‌వుడ్, కెమరూన్ గ్రీన్ కూడా మళ్లీ జట్టులో కలవనున్నారు. అయితే తుది జట్టులో స్థానం కోసం గ్రీన్, బూ వెబ్‌స్టర్ మధ్య పోటీ ఉండే అవకాశం ఉన్నది.
ప్రస్తుతం హేజిల్‌వుడ్‌కు కాస్త భుజం నొప్పి ఉన్నా.. అతను ఫైనల్ వరకు కోలుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. జూన్ 11వ తేదీన టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ ప్రారంభంకానున్నది.
Introducing our squad for the 2025 ICC World Test Championship Final and the Qantas Men’s Test Tour of the West Indies 👊 pic.twitter.com/kZYXWKpQgL
— Cricket Australia (@CricketAus) May 13, 2025