ఆంటిగ్వా: టీ20 వరల్డ్‌కప్(T20 Worldcup)లో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో నమీబియాపై ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆసీస్ లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా తన స్పిన్ మాయాజాలంతో నమీబియాను దెబ్బతీశాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన నమీబియా కేవలం 72 రన్స్‌కే ఆలౌటైంది. అయితే ఆ స్వల్ప టార్గెట్‌ను కేవలం 34 బంతుల్లోనే ఆస్ట్రేలియా ఛేజ్ చేసింది. ట్రావిస్ హెడ్ 34, మిచెల్ మార్ష్ 18 రన్స్ తేడాతో నాటౌట్‌గా నిలిచారు. వరుసగా మూడు మ్యాచ్‌లు నెగ్గిన ఆస్ట్రేలియా.. గ్రూప్ బి నుంచి సూపర్ 8లోకి ప్రవేశించింది. శనివారం జరిగే చివరి గ్రూపు మ్యాచ్‌లో స్కాట్లాండ్తో ఆసీస్ తలపడనున్నది.
మూడు మ్యాచ్‌లు ఆడిన నమీబియా .. రెండింటిలో ఓడిపోయింది. దీంతో ఆ జట్టు సూపర్ 8 రేసు నుంచి ఔటైంది. గ్రూప్ బిలో రెండో స్థానం కోసం స్కాట్లాండ్, ఇంగ్లండ్ జట్ల మధ్య పోటీ నెలకొన్నది. ఇవాళ్టి మ్యాచ్‌లో ఆసీస్ బౌలర్లలో హేజల్‌వుడ్, స్టోయినిస్‌లు రెండేసి వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు. స్పిన్నర్ జంపా కొత్త మైలురాయిని చేరుకున్నాడు. నమీబియాతో మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన అతను.. వ్యక్తిగత మైలురాయిని అందుకున్నాడు. టీ20 అంతర్జాతీయ మ్యాచుల్లో వంద వికెట్లు తీసిన తొలి ఆసీస్ బౌలర్‌గా నిలిచాడతను. నమీబియా జట్టులో గెరార్డ్ ఎరాస్మాస్ ఒక్కడే అత్యధికంగా 36 రన్స్ చేశాడు.
Australia are through to the Second Round of #T20WorldCup 2024 after comprehensive win over Namibia 💪
📝 #AUSvNAM: https://t.co/07OgABBmlt pic.twitter.com/8o6ZB7Wos8
— T20 World Cup (@T20WorldCup) June 12, 2024