సిడ్నీ: సిడ్నీ టెస్టు(AUSvIND)లో ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 181 రన్స్‌కు ఆలౌటైంది. దీంతో భారత్‌కు నాలుగు పరుగుల ఆధిక్యం లభించింది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. బ్రుమా లేకున్నా.. చివరి అయిదు వికెట్లను మిగితా బౌలర్లలు తీసుకున్నారు. సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న ప్రసిద్ధి కృష్ణ తన ఖాతాలో మూడు వికెట్లు వేసుకున్నాడు. నితీశ్ కుమార్ రెడ్డి కూడా కీలక దశలో రెండు వికెట్లు తీశాడు. సిరాజ్ కూడా మూడు వికెట్లు తీసుకున్నాడు. బుమ్రా ఫిట్‌నెస్‌పై మాత్రం ఇంకా డౌట్ ఉన్నది. రెండో రోజు లంచ్ తర్వాత అతను బ్రేక్ తీసుకున్నాడు. స్కానింగ్ కోసం ఆస్పత్రికి వెళ్లాడు. అయితే అతని వద్ద నుంచి ఇంకా రిపోర్టు రాలేదు.
Tea on Day 2 in Sydney!
Mohd. Siraj with the final wicket and Australia are all out for 181 in the 1st innings.#TeamIndia with a lead of 4 runs.
Scorecard – https://t.co/NFmndHLfxu#AUSvIND pic.twitter.com/ksQazID2Do
— BCCI (@BCCI) January 4, 2025
సిడ్నీ టెస్టులో అరంగేట్రం చేసిన ఆసీస్ బ్యాటర్ వెబ్‌స్టర్ తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేశాడు. 57 రన్స్ చేసి ఔటయ్యాడు. సిడ్నీ గ్రౌండ్లో ఆస్ట్రేలియా రెండోసారి అత్యల్ప స్కోర్ చేసింది. గతంలో 2010లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 127కు ఔటైంది. ఆసీస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అరుదైన మైలురాయిని అందుకునే అవకాశాన్ని కోల్పోయాడు. మరో అయిదు పరుగులు చేస్తే అతను అంతర్జాతీయ క్రికెట్లో పది వేల రన్స్ పూర్తి చేయనున్నాడు.
Boland departs, leaving the Aussies all out for 181.
Which team holds the upper hand at this stage in your mind? #AUSvIND
— cricket.com.au (@cricketcomau) January 4, 2025