సిడ్నీ: నిర్ణయాత్మక టెస్టులో భారత్ (IND vs AUS) పోరాడుతున్నది. రెండో ఇన్నింగ్స్‌లో 157 రన్స్ చేసిన టీమ్ఇండియా ఆసీస్ ముందు 162 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. లంచ్ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా 3 వికెట్లు కోల్పోయి 71 రన్స్ చేసింది. విజయానికి మరో 91 పరుగులు చేయాల్సి ఉంది. కాగా, గెలవాలంటే కట్టుదిట్టంగా బంతులు వేయాల్సిన భారత బౌలర్లు ధారాలంగా పరుగులు సమర్పించుకున్నారు. మొదటి ఓవర్ వేసిన సిరాజ్ 13 రన్స్ ఇచ్చాడు. మొత్తగా 7 ఓవర్లు వేసిన హైదరాబాదీ.. వికెట్లేమీ తీయకుండా 38 పరుగులు సమర్పించుకున్నాడు.
మరో ఎండ్‌లో బౌలింగ్ చేసిన ప్రసిద్ధ్ కృష్ణ కూడా మొదట్లో రన్స్ ఇచ్చినప్పటికీ.. తన 3.5వ ఓవర్లో కొన్‌స్టాస్‌ను ఔట్ చేసి భారత్‌ను మ్యాచ్‌లోకి తీసుకొచ్చాడు. అదేవిధంగా తన 8వ ఓవర్లో 52 రన్స్ వద్ద లబుషేన్‌ను దొరకబట్టాడు. స్లిప్స్‌లో జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఇక స్టీవ్ స్మిత్‌ను 4 రన్స్‌కే కట్టడి చేశాడు. ఆఫ్‌సైడ్ వేసిన బంతిని ముందుకు వచ్చి ఆడాలని చూసిన స్మిత్.. స్లిప్స్‌లో యశస్వీ సూపర్ క్యాచ్ పట్టడంతో పెవీలియన్‌కు చేరాడు. దీంతో 10 వేల రన్స్ మార్క్‌కు ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయాడు. మొత్తంగా 13 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ 3 వికెట్ల నష్టానికి 71 రన్స్ చేసింది. ప్రస్తుతం ఉస్మాన్ ఖవాజా (19), ట్రావిస్ హెడ్ (5) క్రీజ్‌లో ఉన్నారు. మ్యాచ్‌లో గెలవాలంటే ఆస్ట్రేలియా మరో 91 పరుగులు చేయాల్సి ఉండగా, ఇండియా 7 వికెట్లు పడగొట్టాలి.