Womens World Cup : మహిళల వన్డే వరల్డ్ కప్‌లో సెమీస్ సమరం ఈసారి ఆసక్తికరంగా సాగనుంది. లీగ్ దశనుంచి అజేయంగా దూసుకెళ్తున్న ఆస్ట్రేలియా(Australia) గురువారం భారత జట్టును ఢీ కొట్టనుంది. స్టేడియంలో ఇరుజట్ల మధ్య బిగ్ ఫైట్ జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం ఆసీస్ టీమ్ సోమవారం నవీ ముంబై చేరుకుంది. అయితే.. వాళ్లలో కొందరు స్థానికంగా ఉన్న ఒక కెఫేకు వెళ్తుంటే ఎస్కార్ట్‌గా పోలీసులు వెళ్లారు. ఎందుకంటే ఆకతాయిలకు చెక్ పెట్టేడానికి.
గతవారం.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో బైక్ మీద వచ్చిన ఒక యువకుడు ఇద్దరు క్రికెటర్ల పట్ల ప్రపవర్తించడం పెద్ద దుమారం రేపింది. ఈ ఘటనపై ఆగ్రహించిన బీసీసీఐ.. పోలీసుల సాయం కోరింది. దాంతో.. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు ఖాకీలు రంగంలోకి దిగారు. అందేకు ముంబైలో ఆసీస్ క్రికెటర్లు బస చేసిన హోటల్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.
Ashleigh Gardner and her wife now travel with police protection 🫡 after recent harassment incidents involving Australian players.#Australia #AshGardner #WWC25 #MrCricketUAE pic.twitter.com/B8KEcGy62j
— Mr. Cricket UAE (@mrcricketuae) October 27, 2025
అంతేకాదు.. ఎవరైనా బయటకు కాఫీ షాప్ లేదంటే షాపింగ్ వెళ్లాలనుకుంటే రక్షణగా పోలీసులు వెంట నడుస్తున్నారు. సోమవారం ఆసీస్ ఆల్‌రౌండర్ అష్ గార్డ్నర్ (Ash Gardner) పోలీసులు తమ వాహనానికి ఎస్కార్ట్‌గా వస్తున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. తన భాగస్వామి మోనికాతో కలిసి కారులో వెళ్తున్న ఫొటోను పోస్ట్ చేసిందీ స్పిన్ ఆల్‌రౌండర్.
Ash Gardner with the all-rounder skills 🌟
Watch her highlights here 👉 https://t.co/4LPsRwsqko pic.twitter.com/AknuUIUcFk
— ICC (@ICC) October 23, 2025
తొమ్మిదో వరల్డ్ కప్ వేటలో ఉన్న ఆస్ట్రేలియా ట్రోఫీకి రెండు అడుగుల దూరంలో ఉంది. గురువారం డీవై పాటిల్ స్టేడియంలో భారత్‌తో ఆసీస్ తలపడనుంది. లీగ్ దశలో టీమిండియాను 3 వికెట్ల తేడాతో గెలుపొందిన అలీసా హేలీ టీమ్.. ఈసారి కూడా పైచేయి సాధించాలనుకుంటోంది. అజేయంగా సెమీస్ చేరిన ఆసీస్ విజయాల్లో గార్డ్నర్ కీలక పాత్ర పోషిస్తోంది. తొలి పోరులో న్యూజిలాండ్‌పై సెంచరీ(104 నాటౌట్)తో చెలరేగిన ఈ ఆల్‌రౌండర్ .. భారత్‌పైనా 45 రన్స్‌తో రాణించింది.