AUS vs PAK 3rd Test: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా – పాకిస్తాన్ మధ్య జరుగుతున్న మూడు టెస్టులో రెండో రోజు సగం ఆట వర్షార్పణమైంది. బుధవారం పాకిస్తాన్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 313 పరుగులకు ఆలౌట్ చేసిన కంగారూలు.. నేడు 46 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమవగా రెండు వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేశారు. తన చివరి టెస్టు ఆడుతున్న డేవిడ్ వార్నర్ (34), ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (47) లు పెవిలియన్ చేరారు.
ఓవర్ నైట్ స్కోరు 6-0తో ఆరంభించిన ఆసీస్‌కు.. తొలి వికెట్‌కు డేవిడ్ వార్నర్-ఉస్మాన్ ఖవాజాలు 70 పరుగులు జోడించారు. వార్నర్‌ను అఘా సల్మాన్ ఔట్ చేయడంతో ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. కొద్దిసేపటికే ఖవాజాను ఆమీర్ జమల్ ఔట్ చేశాడు. లంచ్ తర్వాత లబూషేన్ (23 బ్యాటింగ్), స్టీవ్ స్మిత్ (6 బ్యాటింగ్) లు కొద్దిసేపు ఆడాక వెలుతురు మందగించడంతో అంపైర్లు ఆటను తాత్కాలికంగా రద్దు చేశారు.
Our parade has been rained on and that’s stumps on day two in Sydney.
Day three tickets: https://t.co/G8wMgQpIEM pic.twitter.com/k9Oo80WtWl
— Cricket Australia (@CricketAus) January 4, 2024
టీ కు కొద్దిసేపు ముందు వెలుతురులేమి కారణంగా ఆట ఆగిపోగా.. మూడో సెషన్ ఆట ఆరంభానికి ముందే సిడ్నీలో వర్షం మొదలైంది. కొద్దిసేపు చూసిన అంపైర్లు వర్షం ఎంతకూ ఆగకపోవడంతో ఆటను ముందే నిలిపేశారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్.. 197 పరుగులు వెనుకబడి ఉంది.