AUS vs AFG: అఫ్గానిస్తాన్ బౌలర్ల సమిష్టి కృషితో వాంఖెడేలో ఆస్ట్రేలియా ఓటమి దిశగా సాగుతోంది. 292 పరుగుల ఛేదనలో ఆసీస్.. 17 ఓవర్లకే7 వికెట్లు కోల్పోయి ఓటమికి చేరవవుతోంది. ఆ జట్టులో ప్రధాన బ్యాటర్లంతా పెవిలియన్ చేరారు. డేవిడ్ వార్నర్ (18), ట్రావిస్ హెడ్ (0), మిచెల్ మార్ష్ (24), మార్నస్ లబూషేన్ (14), జోస్ ఇంగ్లిస్ (0), మార్కస్ స్టోయినిస్ (6)లు పెవిలియన్‌కు క్యూ కట్టారు.
292 పరుగుల ఛేదనలో ఆసీస్‌కు ఆది నుంచే కష్టాలు మొదలయ్యాయి. నవీన్ ఉల్ హక్ రెండో ఓవర్లో రెండో బంతికే హెడ్‌ను ఔట్ చేయగా అతడే వేసిన ఆరో ఓవర్లో నాలుగో బంతికి మిచెల్ మార్ష్ పెవిలియన్ చేరాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ వేసిన తొమ్మిదో ఓవర్లో డేవిడ్ వార్నర్, జోస్ ఇంగ్లిస్‌లు ఔట్ అయ్యారు. కొద్దిసేపు వికెట్ల పతనాన్ని ఆపిన మార్నస్ లబూషేన్ రనౌట్ కాగా స్టోయినిస్‌ను రషీద్ ఖాన్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. రషీద్.. 19వ ఓవర్ల స్టార్క్‌ను కూడా లెగ్ బిఫోర్ గా వెనక్కి పంపి ఆ జట్టు పతనాన్ని వేగవంతం చేశాడు. ప్రస్తుతం గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఒక్కడు మాత్రమే బ్యాటర్. ఈ మ్యాచ్‌లో ఆసీస్ గెలవాలంటే అద్భుతమే జరగాలి.