లార్డ్స్: ప్రఖ్యాత లార్డ్స్ వేదికగా వెస్టిండీస్‌తో బుధవారం నుంచి మొదలైన తొలి టెస్టులో మొదటి రోజు ఇంగ్లండ్ సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శించింది. తన కెరీర్లో తొలి టెస్టు ఆడుతున్న ఇంగ్లీష్ పేసర్ గస్ అట్కిన్సన్ (7/45) ఏడు వికెట్లతో విజృంభించడంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ 41.4 ఓవర్లలో 121 పరుగులకే ఆలౌట్ అయింది.
మికైల్ లూయిస్ (27) టాప్‌స్కోరర్. అట్కిన్సన్.. 35వ ఓవర్లో 3 వికెట్లు తీసి వెస్టిండీస్‌ను కోలుకోని దెబ్బకొట్టాడు. ‘వీడ్కోలు టెస్టు’లో పేస్ దిగ్గజం జేమ్స్ అండర్సన్ ఒక వికెట్ పడగొట్టాడు. రెండో సెషనల్లోనే బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లండ్ 38 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. జాక్ క్రాలే (76), ఓలీ పోప్ (57) రాణించారు.