నాగ్‌పూర్ : రంజీ చాంపియన్ విదర్భ, రెస్టాఫ్ ఇండియా మధ్య నాగ్‌పూర్‌లో జరుగుతున్న ఇరానీ కప్‌లో మొదటి రోజు విదర్భ నిలకడగా ఆడింది. టాపార్డర్‌లో కీలక వికెట్లు కోల్పోయినా ఓపెనర్ అథర్వ (118 బ్యాటింగ్) అజేయ సెంచరీ బాదగా యశ్ రాథోడ్ (91) తృటిలో శతకాన్ని మిస్ చేసుకున్నాడు.
మొదటి రోజు ఆట చివరికి విదర్భ 280/5 స్కోరు చేసింది. రెస్టాఫ్ ఇండియా బౌలర్లలో మానవ్ సుతార్ (3/64), ఆకాశ్ దీప్ (2/35) రాణించారు.