SLW vs BANW : మహిళల వన్డే వరల్డ్ కప్‌లో తొలి విజయం కోసం నిరీక్షిస్తున్న శ్రీలంక ఈసారి ముంబైలో బంగ్లాదేశ్‌తో తలపడుతోంది. డీవై పాటిల్ స్టేడియంలో జరుగగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన లంక బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ తొలి బంతికే ఓపెనర్ విష్మీ గుణరత్నే(0) గోల్డెన్ డక్‌గా వెనుదిరిగింది. ఆ తర్వాత.. కెప్టెన్ చమరి ఆటపట్టు (43 నాటౌట్), హాసిని పెరీరా(19 నాటౌట్)లు దూకుడుగా ఆడుతూ స్కోర్ 60 దాటించారు. వీరిద్దరి జోరుతో పవర్ ప్లేలో శ్రీలంక వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. క్రీజులో ఉన్నారు.
స్వదేశంలో వర్షం కారణంగా సెమీస్ అవకాశాల్ని కోల్పోయిన శ్రీలంక బోణీ కోసం నిరీక్షిస్తోంది. టాస్ గెలిచిన శ్రీలంకకు పేసర్ మరుఫా అక్తర్ ఆదిలోనే షాకిచ్చింది. ఇన్నింగ్స్ తొలి బంతికే ఓపెనర్ విష్మీ గుణరత్నే(0)ను ఎల్బీగా వెనక్కి పంపింది. అయితే.. ఆ తర్వాత వచ్చిన హాసిని పెరీరా(19 నాటౌట్) ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వకుండా మూడు, నాలుగు బంతుల్ని బౌండరీకి పంపింది.
4000 and counting! Another milestone for Chamari Athapaththu 👏 pic.twitter.com/QS21ZQtbRj
— ESPNcricinfo (@ESPNcricinfo) October 20, 2025
4000 and counting! Another milestone for Chamari Athapaththu 👏 pic.twitter.com/QS21ZQtbRj
— ESPNcricinfo (@ESPNcricinfo) October 20, 2025
నిశితా అక్తర్ ఓవర్లో ఫోర్ బాదిన చమరి ఆటపట్టు(43 నాటౌట్) వన్డేల్లో 4వ వేల పరుగుల క్లబ్లో చేరింది. మరుఫాను టార్గెట్ చేసిన లంక కెప్టెన్ ఐదో ఓవర్లో తొలి రెండు బంతులకు 6, 4 సాధించి బంగ్లాను భయపెట్టింది. నిహిదా అక్తర్ వేసిన 9 వ ఓవర్లో రెచ్చిపోయిన ఆటపట్టు ఒక సిక్స్, రెండు ఫోర్లతో 14 రన్స్ పిండుకుంది.