SLW vs ENGW : సొంతగడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్‌లో శ్రీలంక(Srilanka) జట్టుకు బిగ్ షాక్. అలాఅనీ వికెట్ ఏమీ పడలేదు. ఇంగ్లండ్ నిర్దేశించిన భారీ ఛేదనలో చెలరేగిపోవాలని, పెద్ద ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాలనుకున్న కెప్టెన్ చమరి ఆటపట్టు (Chamari Athapaththu) అనూహ్యంగా మైదానం వీడింది. లిన్సే స్మిత్ (Linsey Smith) వేసిన ఆరో ఓవర్లో ఆమె రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగింది. దాంతో, తర్వాతి బ్యాటర్‌గా విష్మీ గౌతమి క్రీజులోకి వచ్చింది.
అసలేం జరిగిందంటే.. మూడో బంతిని డీప్ మిడ్‌వికెట్ దిశగా ఆడిన ఆటపట్టు ఇబ్బంది పడుతూనే సింగిల్ తీసింది. కండరాల నొప్పి కారణంగా కుంటుతూనే పరుగు పూర్తి చేసిన ఆమె ఆ తర్వాత మోకాళ్లపై కూలబడింది. అయినా ఉపశమనంగా లేకపోవడంతో అక్కడే పడుకుంది. దాంతో.. ఫిజియో వచ్చి ఆమెను పరిశీలించాడు. క్రాంప్స్‌ను తగ్గించేందుకు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు.
Chamari Athapaththu has been carried off the field on a stretcher, which is a massive blow for Sri Lanka. 👀
Signs of discomfort suggest she might have pulled her hamstring. 🤕#ENGvSL #CWC25 #Cricket #Sportskeeda pic.twitter.com/n6ebdZ9nfS
— Sportskeeda (@Sportskeeda) October 11, 2025
నొప్పి తగ్గకపోవడంతో ఆటపట్టు లేచి నడిచే పరిస్థితి కనిపించలేదు. దాంతో.. సిబ్బంది పరుగున వచ్చి.. స్ట్రెచర్ మీద లంక కెప్టెన్‌ను బయటకు తీసుకెళ్లారు. అయితే.. ఆమెకు క్రాంప్స్ మాత్రమేనా.. ఇంకా ఏదైనా అయిందా? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఆటపట్టు మళ్లీ బ్యాటింగ్‌కు రాలేదంటే 254 పరుగుల ఛేదనలో లంక ఎంతమేరకు పోరాడుతుందో చెప్పలేం.