Blast At Cricket Stadium | వాయువ్య పాకిస్థాన్ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఒకరు చనిపోగా.. చాలామంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. బజౌర్ జిల్లాలోని ఖర్ తహసీల్‌లోని కౌసర్ క్రికెట్ గ్రౌండ్లో ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుడు అత్యాధునిక సాంకేతికను ఉపయోగించి పేలుడుకు పాల్పడ్డారని బజౌర్ జిల్లా పోలీసు అధికారి వకాస్ రఫీక్ తెలిపారు. లక్ష్యంగా చేసుకొని జరిపిన దాడిగా కనిపిస్తోందని పేర్కొన్నారు. అయితే, ఇప్పటి వరకు ఏ గ్రూప్ పేలుడుకు బాధ్యత వహించలేదు.
అయితే, గత నెలలో భద్రతా దళాలు ప్రారంభించిన ఆపరేషన్ సర్బకాఫ్ దృష్ట్యా.. పోలీసు అధికారులు ఉగ్రవాదుల చర్యగా భావిస్తున్నారు. శనివారం ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో జరిగిన రెండు వేర్వేరు సంఘటనలలో కనీసం ముగ్గురు ఉగ్రవాదులు, ఒక పోలీసు అధికారి మరణించారు. ప్రావిన్స్‌లోని కోహత్ జిల్లాలోని లాచి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారని పోలీసులు తెలిపారు. మరొక సంఘటనలో లాచి తహసీల్‌లోని దర్మలక్ పోలీస్ చెక్‌పోస్ట్ సమీపంలో గుర్తు తెలియని దుండగులు పోలీసు వ్యాన్‌పై మెరుపుదాడి చేయడంతో ఒక కానిస్టేబుల్ మరణించాడు.
⚡️ 1 KILLED as blast tears through cricket match in Pakistan
Sudden IED explosion in Bajaur, Khyber Pakhtunkhwa
Panic, screams, chaos — police call it ‘a TARGETED attack’ pic.twitter.com/rTBDePGD1j
— RT (@RT_com) September 6, 2025