అమ్మాన్ (జోర్డాన్): ఏషియన్ అండర్-15 బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత బాక్సర్లు అదరగొడుతున్నారు. ఈ టోర్నీలో ఇది వరకే ఆరుగురు భారత బాక్సర్లు సెమీస్ చేరగా గురువారం మరో ఐదుగురు సెమీఫైనల్స్‌కు అర్హత సాధించారు.
సెమీస్ చేరిన వారిలో ఇద్దరు మహిళా బాక్సర్లు ఉన్నారు. నెల్సన్ (55 కిలోలు), అభిజీత్ (61 కి.), లక్ష్య పొగాట్ (64 కి.), ప్రిన్సి (55 కి.), సమృద్ధి సతీశ్ (55 కి.) క్వార్టర్స్ పోరులో ప్రత్యర్థులను చిత్తు చేశారు.