కరాచీ : వచ్చే నెలలో ఇస్లామాబాద్ (పాకిస్థాన్) ఆతిథ్యమివ్వాల్సి ఉన్న ఆసియా టీమ్ స్కాష్ చాంపియన్‌షిప్ వాయిదాపడింది. గల్ఫ్‌లో నెలకొన్న యుద్ధ వాతావరణానికి తోడు పాక్ అంతర్గత సమస్యలతో ఈ టోర్నీని వాయిదావేసినట్టు ఆసియా స్కాష్ సమాఖ్య తెలిపింది.
ఏప్రిల్ 14-18 మధ్య జరగాల్సి ఉన్న ఈ టోర్నీని సెప్టెంబర్‌లో నిర్వహించే అవకాశమున్నట్టు సమాచారం.