హైదరాబాద్, ఆట ప్రతినిధి: బ్యాంకాక్(థాయ్లాండ్) వేదికగా జరిగిన ప్రతిష్ఠాత్మక ఏషియన్ స్కూల్ చెస్ చాంపియన్షిప్లో భారత్కు చెందిన శ్రీదర్శిని పసిడి పతకంతో మెరిసింది. టీమ్ ర్యాంకింగ్ ఈవెంట్లో పోటీకి దిగిన దర్శిని అద్భుత ప్రదర్శన కనబరిచింది.
ప్రత్యర్థులకు దీటైన పోటీనిస్తూ ముందుకు సాగిన ఈ యువ చెస్ ప్లేయర్ టైటిల్ను సొంతం చేసుకుంది. ఏషియన్ చెస్ టోర్నీలో మెరిసిన దర్శినిని రాష్ట్ర చెస్ అసోసియేషన్ ప్రత్యేకంగా అభినందించింది.