హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఈ నెల 22 నుంచి హైదరాబాద్ వేదికగా జరుగనున్న ఆసియా మెన్స్ క్లబ్ లీగ్ హ్యాండ్బాల్ చాంపియన్షిప్ ఏర్పాట్లను ఫెడరేషన్ టెక్నికల్ కమిటీ సభ్యుడు మహమ్మద్ తలేబ్ పరిశీలించారు. గచ్చిబౌలి స్టేడియంలో వారం రోజుల పాటు సాగనున్న ఈ టోర్నీ పనులను భారత హ్యాండ్బాల్ సమాఖ్య అధ్యక్షుడు అరిశనపల్లి జగన్మోహన్రావుతో కలిసి ఆదివారం పరిశీలించిన తలెబ్.. ఏర్పాట్లు బాగున్నాయని ప్రశంసించారు. ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో స్టేడియం సిద్ధం చేశారని.. ఆసియా క్లబ్ లీగ్ చాంపియన్షిప్ చరిత్రలో ఈ టోర్నీ ప్రత్యేకంగా నిలుస్తుందనే నమ్మకముందని అన్నారు.