Asian Games | ఆసియా క్రీడల్లో భారత్కు మరో స్వర్ణం.. మెన్స్ బ్యాడ్మింటన్ డబుల్స్లో పతకం
Asian Games | ఆసియా క్రీడల్లో భారత్కు మరో స్వర్ణం దక్కింది. చైనాలోని హాంగ్జౌ నగరంలో శనివారం మధ్యాహ్నం జరిగిన మెన్స్ బ్యాడ్మింటన్ డబుల్స్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ చంద్రశేఖర్ శెట్టిల జోడీ.. కొరియాకు చెందిన చోయ్ సోల్గ్యూ, కిమ్ వోన్హో జోడీపై 21-18, 21-16 తేడాతో గెలుపొంది స్వర్ణ పతకాన్ని చేజిక్కించుకుంది.
హాంగ్జౌ: ఆసియా క్రీడల్లో భారత్కు మరో స్వర్ణం దక్కింది. చైనాలోని హాంగ్జౌ నగరంలో శనివారం మధ్యాహ్నం జరిగిన మెన్స్ బ్యాడ్మింటన్ డబుల్స్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ చంద్రశేఖర్ శెట్టిల జోడీ.. కొరియాకు చెందిన చోయ్ సోల్గ్యూ, కిమ్ వోన్హో జోడీపై 21-18, 21-16 తేడాతో గెలుపొంది స్వర్ణ పతకాన్ని చేజిక్కించుకుంది. కొరియా జోడీ రజతంతో సరిపెట్టుకుంది.
కాగా, తాజా స్వర్ణంతో కలిపి ఆసియా క్రీడల్లో భారత్కు గెలిచిన గోల్డ్ మెడల్స్ సంఖ్య 26 కు పెరిగింది. మొత్తం పతకాల సంఖ్య 101గా ఉంది. అందులో 35 రజతాలు, 40 కాంస్యాలు ఉన్నాయి. పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నది. చైనా 354 పతకాలతో (187 స్వర్ణాలు, 104 రజతాలు, 63 కాంస్యాలు) అగ్ర స్థానంలో ఉండగా, జపాన్ 169 పతకాలతో (47 స్వర్ణాలు, 57 రజతాలు, 65 కాంస్యాలు) రెండో స్థానంలో, కొరియా 171 పతకాలతో (36 స్వర్ణాలు, 50 రజతాలు, 85 కాంస్యాలు) మూడో స్థానంలో కొనసాగుతున్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

