Hokey India | ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీలో దాయాది పాకిస్థాన్ జట్టుపై భారత్ జట్టు విజయం సాధించింది. శుక్రవారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించి సెమీ ఫైనల్స్‌లో అడుగు పెట్టింది. 8వ, 53 నిమిషంలో హాకీ ఇండియా వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ రెండు గోల్స్, 42వ నిమిషంలో ఆకాశ్ దీప్ సింగ్ మరో గోల్ కొట్టారు. దీంతో భారత్ 3-1 తేడాతో పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించింది. 45వ నిమిషంలో పాక్ ఆటగాడు జునైద్ మంజూర్ ఒక గోల్ చేశాడు. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో చివరి సారి పాక్‌తో ఆడిన మ్యాచ్‌లోనూ భారత్ 3-1 గోల్స్‌తో నెగ్గడం గమనార్హం.
54' Suraj Karkera you beauty! 🔥🤩
— Hockey India (@TheHockeyIndia) December 17, 2021
The keeper makes his second save off the Penalty Corner and Pakistan are denied once again.
🇮🇳 3:1 🇵🇰#IndiaKaGame #HeroACT2021
ఈ టోర్నీలో భారత్క్ ఇది రెండో విజయం. ఇంతకు ముందు బంగ్లాదేశ్‌తో ఆడిన మ్యాచ్‌లో భారత్ 9-0 తేడాతో గెలుపొందింది. దక్షిణకొరియాతో జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో భారత్ 2-2తో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచుల్లో రెండింట్లో గెలుపొందిన భారత హాకీ జట్టు.. ఏడు పాయింట్లు సాధించింది. దీంతో ఐదు దేశాల టోర్నీలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. రాబిన్ రౌండ్ పద్దతిలో ఆదివారం తన చివరి మ్యాచ్‌లో జపాన్‌తో భారత్ తలపడుతుంది.