కింగ్డావొ (చైనా): ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో మకావుతో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన భారత షట్లర్లకు రెండో మ్యాచ్‌లో పరాభవం ఎదురైంది. గురువారం ఇక్కడ జరిగిన గ్రూప్-డీ పోరులో భారత్ 2-3తో దక్షిణ కొరియా చేతిలో ఓడింది. మిక్స్డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల-తనీషా క్రాస్టో జోడీ 21-11, 12-21, 15-21తో డాంగ్ జు-జియోంగ్ చేతిలో ఓడింది.
ఆ తర్వాత మహిళల సింగిల్స్‌లో సిమ్ యు జిన్ 21-9, 21-10తో మాళవిక బన్సోద్‌ను చిత్తుచేసి ఆధిక్యాన్ని 2-0కు తీసుకెళ్లింది. కానీ ఆ తర్వాత పురుషుల సింగిల్స్‌లో సతీశ్ కుమార్ 17-21, 21-18, 21-19తో చొ జియోనియోప్ను ఓడించి భారత్‌ను పోటీలోకి తెచ్చాడు. మహిళల డబుల్స్‌లో త్రిసా జాలీ-గాయత్రి గోపీచంద్ ద్వయం 19-21, 21-16, 21-11తో కిమ్ మిన్ జి-కిమ్ యు జంగ్‌ను ఓడించడంతో ఇరు జట్లు 2-2తో నిలిచాయి. ఇక నిర్ణయాత్మక పురుషుల డబుల్స్‌లో సాత్విక్-ఎంఆర్ అర్జున్ జోడీ 14-21, 15-23తో జిన్ యంగ్-సుంగ్ సియోంగ్ చేతిలో ఓడటంతో భారత్‌కు అపజయం తప్పలేదు.