Odisha Masters : సొంతగడ్డపై జరుగుతున్న ఒడిశా మాస్టర్స్ సూపర్ 100 టోర్నమెంట్లో భారత డబుల్స్ ద్వయం అశ్వినీ పొన్నప్ప(Ashwini Ponnappa), తనీశ క్రాస్టో(Tanisha Crasto) ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన సెమీఫైనల్లో అర్లియా నబిలా థీసా ముంగ్గరన్, అగ్నియా శ్రీ రహయూ(ఇండోనేషియా)పై సులువుగా గెలుపొందింది. 37 నిమిషాల పాటు సాగిన పోరులో 21-17, 21-13తో అశ్విని, తనీశ జోడీ విజయం సాధించింది. ఈ సీజన్లో ఈ ఇద్దరికి ఇది వరుసగా మూడో ఫైనల్ కావడం విశేషం.
ఇక మిక్సడ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల, క్రాస్టో జోడీ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో డెన్మార్క్‌కు చెందిన మడ్స్ వెస్టెర్గార్డ్, క్రిస్టినే బస్చ్ను 21-14, 21-14తో చిత్తు చేసింది. పురుషుల సింగిల్స్‌లో ఆయూష్ శెట్టి దుమ్మురేపాడు. ఇండోనేషియాకు చెందిన అల్వీ ఫర్హాన్‌ను మట్టికరిపించి.. భారత్‌కే చెందిన సతీశ్ కుమార్ కరుణాకరన్‌తో టైటిల్ పోరుకు సిద్ధమయ్యాడు.