Guwahati Masters: భారత బ్యాడ్మింటన్ మహిళల డబుల్స్ పెయిర్ అశ్విని పొన్నప్ప – తనీషా క్రాస్టోలు గువహటి మాస్టర్స్ సూపర్ 100 టైటిల్ నెగ్గారు. రెండో సీడ్ అశ్విని – తనీషాలు ఆదివారం ముగిసిన తుదిపోరులో 21-13, 21-19 తేడాతో చైనీస్ తైఫీకి చెందిన సుంగ్ షో యున్-యూ చీన్ హుయి జోడీని ఓడించారు. 40 నిమిషాల పాటు జరిగిన పోరులో భారత ద్వయం ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించి టైటిల్ గెలుచుకున్నారు.
భారత ద్వయానికి ఇది మూడో మేజర్ టైటిల్. ఈ ఏడాది అబుదాబి మాస్టర్స్‌తో పాటు నేంట్స్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్ నెగ్గిన పొన్నప్ప – తనీషాలు ఇటీవలే ముగిసిన సయిద్ మోడీ ఇంటర్నేషనల్ సూపర్ 300 టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ జోడీకి సూపర్ 100 కేటగిరీలో అబుదాబి మాస్టర్స్ తర్వాత ఇది రెండో టైటిల్.
Its first BWF World Tour FINAL for the rising duo of Ashwini & Tanisha. https://t.co/Mofhl9gwgL pic.twitter.com/HQeJRN8eXX
— India_AllSports (@India_AllSports) December 3, 2023