Ashwin : అంతర్జాతీయ క్రికెట్‌కు.. ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన రవిచంద్రన్ అశ్విన్ (Ashwin) తదుపరి ఏ నిర్ణయం ఏంటీ? అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఐపీఎల్లో అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో ఐదో స్థానంలో ఉన్న యశ్ ఇకపై ఏ లీగ్‌లో ఆడుతాడు? అనేది త్వరలోనే తెలియనుంది. ఈ వెటరన్ ప్లేయర్ మాత్రం విదేశీ టీ20 లీగ్స్‌పై ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. 16 ఏళ్ల ఐపీఎల్ కెరీర్లో పొట్టి ఫార్మాట్ గురించి అణువణువు తెలుసుకున్న అశ్విన్ పలు విదేశీ ఫ్రాంచైజీలను ఆకర్షిస్తున్నాడు.
మ్యాచ్ విన్నర్ అయిన ఈ స్పిన్ ఆల్‌రౌండర్‌ను దక్కించుకునేందుకు పలు జట్లు పోటీపడుతున్నాయి. వీటిలో హండ్రెడ్ లీగ్ (The Hundred League), మేజర్ లీగ్ క్రికెట్(MSL), ఇంటర్నేషనల్ టీ20, ఎస్ఏ20.. వంటివి అశ్విన్‌తో ఒప్పందం కుదుర్చుకునేందుకు పావులు కదుపుతున్నాయి. భారత జట్టు తరఫున, ఐపీఎల్లో ఐదు జట్ల తరఫున చిరస్మరణీయ ప్రదర్శన చేసిన బౌలర్ అశ్విన్. క్యారమ్ బాల్స్‌తో బ్యాటర్లను బోల్తా కొట్టేంచే అతడు ఇకపై విదేశాల్లో తన స్పిన్ మ్యాజిక్ చూపించాలని భావిస్తున్నాడు. ఈ తమిళ తంబీ రికార్డులు తెలిసి అతడిపై కోట్లు కుమ్మరించేందుకు పలు విదేశీ లీగ్ జట్ల యజమానులు కాచుకొని ఉన్నారు.
#RavichandranAshwin announces his retirement from the #IPL, concluding a distinguished 16-year career in the league. From his debut with CSK to 187 wickets across five franchises, swipe to know about his contributions.
Edits: Rishi B#DTNext #India #Sports #Cricket pic.twitter.com/2qVcki9Gln
— DT Next (@dt_next) August 27, 2025
ఇంగ్లండ్ గడ్డపై జరుగుతున్న ది హండ్రెడ్ లీగ్‌లోని జట్లు అశ్విన్‌తో ఒప్పందం కోసం తహతహలాడుతున్నాయి. అమెరికాలో జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ ఫ్రాంచైజీలు, యూఈఏలోని ఐఎల్టీ20, దక్షిణాఫ్రికాలో కొనసాగుతున్న ఎస్ఏ20 లీగ్ జట్లు కూడా ఈ వెటరన్ ప్లేయర్‌ను సొంతం చేసుకోవాలని అనుకుంటున్నాయి.
ఆస్ట్రేలియా పర్యటన మధ్యలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి అందర్నీ ఆశ్చర్యపరిచిన అశ్విన్ ఐపీఎల్‌కు టాటా చెప్పాడు. ప్రస్తుతం అతడికి 38 ఏళ్లు. స్పిన్నర్ కాబట్టి మరో రెండు మూడేళ్లు ఆడగల సామర్ధ్యం అతడి సొంతం. అయితే.. ఈ స్పిన్ దిగ్గజం అవసరమైతే కోచ్‌గానూ అవతారం ఎత్తేందుకు సిద్దమవుతున్నాడు. ఇవేవీ కుదరకుంటే కామెంటేటర్‌గానూ అశ్విన్ రాణించే అవకాశాల్ని కొట్టిపారేయలేం.
🚨ASHWIN’s IPL JOURNEY🚨
⚡️Chennai Super Kings (2009-2015)
⚡️Rising Pune Supergiant (2016-2017)
⚡️Punjab Kings (2018-2019)
⚡️Delhi Capitals (2020-2021)
⚡️Rajasthan Royals (2022-2024)
⚡️Chennai Super Kings (2025)With 187 wickets, he ends his IPL career as the 5th highest… pic.twitter.com/Ed4iXNYpyS
— Cricbuzz (@cricbuzz) August 27, 2025
ఎందుకుంటే మాజీ ఆటగాళ్లు చాలామంది కామెంటరీ బాక్స్‌లో అలరిస్తున్నారు. ఈమధ్యే అన్ని ఫార్మాట్లకు అల్విదా పలికిన ఛతేశ్వర్ పూజారా ఇంగ్లండ్ పర్యటన నుంచే విశ్లేషకుడిగా కొత్త అధ్యాయం మొదలు పెట్టాడు. ఆట గురించి లోతైన అవగాహన కలిగిన అశ్విన్ కూడా మైక్ అందుకుంటే గలగలా మాట్లాడుతూ అభిమానులను ఎంటర్టైన్ చేయడం పక్కా అంటున్నారు క్రీడా పండితులు.