న్యూఢిల్లీ: రవిచంద్రన్ అశ్విన్(Ashwin).. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అత్యధిక వికెట్లు తీసిన రెండవ భారత సిన్నర్‌గా అతని పేరిట రికార్డు ఉన్నది. ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ టెస్టు ముగియగానే అతను తన రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇవాళ ఉదయం అశ్విన్ స్వంత పట్టణం చెన్నై చేరుకున్నాడు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం దక్కింది. అయితే బీసీసీఐ ఇవాళ తన ఎక్స్ పోస్టులో ఓ వీడియోను పోస్టు చేసింది. డ్రెస్సింగ్ రూమ్‌లో ఎప్పుడూ సరదాగా ఉండే అతను.. సపోర్టు స్టాఫ్‌తో ఫన్నీ మూమెంట్స్ గడిపాడు. జట్టు సభ్యులు, సపోర్ట్ స్టాఫ్‌తో నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొన్న అశ్విన్ వీడియోను బీసీసీఐ షేర్ చేసింది. ఫీల్డ్‌పై అశ్విన్ పోరాటం చిరస్మరణీయమని, సపోర్ట్ స్టాఫ్‌తోనూ అతను ఇలా గడిపారంటూ తన ట్వీట్లో బీసీసీఐ తెలిపింది.
The countless battles on the field are memorable ❤️
But it’s also moments like these that Ashwin will reminisce from his international career 😃👌
Check out @ashwinravi99 supporting his beloved support staff 🫶#TeamIndia | #ThankYouAshwin pic.twitter.com/OepvPpbMSc
— BCCI (@BCCI) December 19, 2024
38 ఏళ్ల అశ్విన్ 106 టెస్టుల్లో 537 వికెట్లు తీసుకున్నాడు. కుంబ్లే 619 వికెట్లు తీశాడు. ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్, ట్రైనర్ సోహమ్ దేశాయ్, అనలిస్టు హరి ప్రసాద్ మోహన్, మసార్ అరుణ్ కన్నడేతో కలిసి అశ్విన్ నెట్స్‌లో సరదాగా గడిపాడు. వారితో స్పిన్ బౌలింగ్ వేయించాడు.