TNPL 2025 : భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(R Ashwin) వరుసగా వివాదాల్లో నిలుస్తున్నాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్ (TNPL 2025) 9వ సీజన్లో మహిళా అంపైర్‌తో గొడవ పడిన అశ్విన్.. వారం తిరగకుండానే తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఈసారి ఈ దిగ్గజ స్పిన్నర్ బాల్ ట్యాంపరింగ్ (Ball Tampering) ఆరోపణులు ఎదుర్కొంటున్నాడు. టీఎన్‌పీఎల్‌లో దుండిగల్ డ్రాగన్స్()కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అశ్విన్ బంతి స్వరూపాన్ని మర్చేందుకు ప్రయత్నించాడని సైచెమ్ మధురై పాంథర్స్ జట్టు ఫిర్యాదు చేసింది.
తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో భాగంగా జూన్ 14న సేలంలోని ఎస్సీఎఫ్ క్రికెట్ మైదానంలో దుండిగల్, మధురై పాంథర్స్ తలపడ్డాయి. అయితే.. ఈ మ్యాచ్‌లోనే అశ్విన్, అతడి జట్టు సభ్యులు బాల్ టాంపరింగ్‌కు పాల్పడ్డారని మధురై పాంథర్స్ యాజమాన్యం టీఎన్‌పీఎల్ నిర్వాహకులకు లేఖ రాశారు. అందులో ఏముందంటే…
Siechem Madurai Panthers has accused R. Ashwin’s Dindigul Dragons of ball tampering in the TNPL.
TNPL asks Panthers for proof.
Details 👉https://t.co/lSO0aZe3Wn pic.twitter.com/fr98tY9kOq
— Sportstar (@sportstarweb) June 16, 2025
‘అశ్విన్, అతడి సహచరులు రసాయనాల్లో ముంచిన టవళ్లతో బంతిని పదే పదే తుడిచారు. తద్వారా బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించారు. అలా చేయడం తప్పని వారించినా కూడా వినకుండా బాల్ ట్యాంపరింగ్‌ను కొనసాగించారు’ అని మధురై పాంథర్స్ తమ ఫిర్యాదులో రాసుకొచ్చింది. అయితే.. టీఎన్‌పీఎల్ సీఈవో ప్రసన్న కన్నన్ (Prasanna Kannan) మాత్రం బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలను కొట్టిపారేయలేదు. అశ్విన్, అతడి జట్టు సభ్యులు ఈ నేరానికి పాల్పడ్డారనడానికి తగిన ఆధారాలను సమర్పించాలని మధురై పాంథర్స్‌ను ఆదేశించింది.
‘మధురై పాంథర్స్ యాజమాన్యం బాల్ట్యాంపరింగ్పై ఫిర్యాదు చేసింది. వాళ్ల లేఖను మేము స్వీకరించాం. అయితే.. ఎవరైనా సరే మ్యాచ్ జరిగిన 24 గంటల్లోనే కంప్లైట్ చేయాల్సి ఉంటుంది. అయినా కూడా మేము ఆ ఫ్రాంచైజీ లెటర్‌ను తీసుకున్నాం. అందుకు తగిన ఆధారాలు చూపించాల్సిందిగా కోరాం. ఒకవేళ వాళ్ల ఆరోపణలు నిజమైతే.. ఒక స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే.. ఎవిడెన్స్ లేకుండా క్రికెటర్లపై నిందలు వేయడం క్షమించరాని నేరం అవుతుంది. మధురై పాంథర్స్ గనుక ఆధారాలను చూపకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం’ అని ప్రసన్న ఒక ప్రకటనలో తెలిపారు.