Ravichandran Ashwin : భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) మరో ఘనత సాధించాడు. ఈ మధ్యే 500 వికెట్ల క్లబ్లో చేరిన ఈ ఆఫ్ స్పిన్నర్ ఇంగ్లండ్‌పై 100 వికెట్లు తీశాడు. దాంతో, ఈ ఫీట్ సాధించిన తొలి భారత బౌలర్‌గా అశ్విన్ చరిత్ర సృష్టించాడు.
రాంచీలో జరుగుతున్న నాలుగో టెస్టులో అశ్విన్ దంచికొడుతున్న జానీ బెయిర్‌స్టో(38)ను ఎల్బీగా ఔట్ చేశాడు. కీలక సమయంలో అతడని వెనక్కి పంపి 100వ వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు ఇంగ్లీష్ జట్టుపై వంద వికెట్లతో పాటు 1000 పరుగులు బాదిన తొలి ఆసియా క్రికెటర్‌గా అశ్విన్ మరో రికార్డు నెలకొల్పాడు.
A special 💯! 👏 👏
1⃣0⃣0⃣th Test wicket (and counting) against England for R Ashwin! 🙌 🙌
Follow the match ▶️ https://t.co/FUbQ3Mhpq9 #TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/uWVpQnx3jz
— BCCI (@BCCI) February 23, 2024
రాజ్‌కోట్ టెస్టు(Rajkot Test)లో అశ్విన్ ఐదొందల వికెట్ తీశాడు. ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలే (Jack Crawley) ను ఔట్ చేసిన అశ్విన్.. 500వ వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా ఈ ఫీట్ సాధించిన తొమ్మిదో బౌలర్‌గా యష్ రికార్డు సృష్టించాడు. అనిల్ కుంబ్లే(Anil Kumble) తర్వాత ఈ ఘనతకు చేరువైన రెండో భారత బౌలర్‌గా అశ్విన్ రికార్డు నెలకొల్పాడు. అంతేకాదు తక్కువ బంతుల్లోనే 500 వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా ఈ స్పిన్ మాంత్రికుడు గుర్తింపు సాధించాడు.
అశ్విన్ కంటే ముందు ముగ్గురు మాత్రమే ఇంగ్లండ్‌పై వంద వికెట్లు, వెయ్యికి పైగా రన్స్ చేశారు. వెస్టిండీస్ క్రికెటర్ గ్యారీ సోబర్స్ 3,214 పరుగులు చేసి.. 102 వికెట్లు పడగొట్టాడు. మోంటీ నొబ్లే(ఆస్ట్రేలియా) 1,905 పరుగులు చేయడమే కాకుండా 115 వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియాకే చెందిన గిఫ్ఫెన్ ఇంగ్లండ్‌పై 1,085 పరుగులు కొట్టి, 100 వికెట్లు నేల కూల్చాడు.