లండన్ : వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో టాప్‌సీడ్ సబలెంంకా జోరు కొనసాగుతున్నది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సబలెంకా 6-4, 7-6(7-4)తో మెర్టెన్స్పై అలవోక విజయం సాధించింది.
పూర్తి ఏకపక్షంగా సాగిన పోరులో సబలెంకా చాంపియన్ ఆటతీరు కనబరిచింది. తనదైన ఆధిపత్యం కొనసాగిస్తూ వరుస సెట్లలో ప్రత్యర్థిని మట్టికరిపించింది. మరోవైపు మిగతా సింగిల్స్‌లో సిగ్మెండ్, పవ్లుచెంకోవా ముందంజ వేశారు.