దుబాయ్: టీమ్ఇండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్‌సింగ్ ప్రతిష్ఠాత్మక ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును కైవసం చేసుకున్నాడు. శనివారం ఐసీసీ ప్రకటించిన అవార్డు జాబితాలో అర్ష్‌దీప్‌కు చోటు దక్కింది. తన స్వింగ్ బౌలింగ్‌తో పొట్టి ఫార్మాట్లో వికెట్ల వేట కొనసాగిస్తున్న అర్ష్‌దీప్ అనతికాలంలోనే అత్యుత్తమ బౌలర్‌గా ఎదిగాడు.
నిరుడు వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌ను భారత్ గెలువడంలో ఈ పంజాబ్ పేసర్‌ది కీలక పాత్ర. మెగాటోర్నీలో 8 మ్యాచ్‌ల్లో 12.64 సగటుతో సింగ్ 17 వికెట్లు పడగొట్టి టాప్‌లో నిలిచాడు. ఐసీసీ టీ20 టీమ్‌కు కెప్టెన్‌గా రోహిత్‌శర్మ ఎంపికవ్వగా భారత్ నుంచి అర్ష్‌దీప్‌సింగ్, బుమ్రా, హార్దిక్‌పాండ్యా చోటు దక్కించుకున్నారు. మహిళల టీ20 టీమ్‌కు మంధాన, రీచా, దీప్తిశర్మ ఎంపికయ్యారు.