ముంబై: పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 196 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. అర్షదీప్ సింగ్ వేసిన ఆరో ఓవర్లో పృథ్వీ షా(32).. క్రిస్‌గేల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 59 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరపడింది. షా ధనాధన్ బ్యాటింగ్‌తో జట్టుకు మెరుపు ఆరంభానిచ్చాడు. తన దూకుడుతో ఐదో ఓవర్లోనే జట్టు స్కోరు 50 దాటింది. మరో ఓపెనర్ ధావన్(58) స్కోరు బోర్డును ముందుండి నడిపిస్తున్నాడు. 31 బంతుల్లో గబ్బర్ 8 ఫోర్ల సాయంతో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో స్మిత్(8) నిదానంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. 10 ఓవర్లకు ఢిల్లీ వికెట్ నష్టానికి 99 పరుగులు చేసింది.
Shikhar Dhawan gets to his FIFTY in 31 deliveries.
— IndianPremierLeague (@IPL) April 18, 2021
Live – https://t.co/wbefi7u3wk #DCvPBKS #VIVOIPL pic.twitter.com/PQVxGUTI9F