IND vs AUS : పొట్టి సిరీస్‌లో కీలకమైన నాలుగో టీ20లో భారత బౌలర్లు చెలరేగుతున్నారు. వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ ఆస్ట్రేలియాను ఒత్తిడిలో పడేస్తున్నారు. సిక్సర్‌తో గేర్ మార్చిన టిమ్ డేవిడ్(14)ను షార్ట్ పిచ్ బంతితో దూబే బోల్తా కొట్టించాడు. ఆ కాసేపటికే అర్ష్‌దీప్ సింగ్ (1-22) ఓవర్లో ఫిలిప్పే(10) వెనుదిరిగాడు. మిడాన్‌లో అతడు వరుణ్ చేతికి చిక్కాడు. దాంతో.. ఆసీస్ ఐదో వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం మార్కస్ స్టోయినిస్(5 నాటౌట్), గ్లెన్ మ్యాక్స్‌వెల్(1 నాటౌట్) జట్టును గెలిపించే బాధ్యత తీసుకున్నారు. 14 ఓవర్లకు స్కోర్.. ఇంకా విజయానికి ఆరు ఓవర్లలో 69 పరుగులు కావాలి.
భారత్ నిర్దేశించిన 168 పరుగుల భారీ ఛేదనలో ఆస్ట్రేలియా(Australia)కు ఆదిలోనే అక్షర్ పటేల్ షాకిచ్చాడు. దంచికొడుతున్న డేంజరస్ ఓపెనర్ మాథ్యూ షార్ట్(25)ను ఎల్బీగా వెనక్కి పంపాడు. దాంతో.. పరుగలు వద్ద ఆతిథ్య జట్టు తొలి వికెట్ కోల్పోయింది. మొదట అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో రివ్యూ తీసకొని టీమిండియా అతడి వికెట్ సాధించింది. ఆతర్వాత వచ్చిన జోష్ ఇంగ్లిస్(10) బుమ్రా ఓవర్లో రెండు బౌండరీలు బాదాడు. దాంతో.. పవర్ ప్లేలో వికెట్ నష్టానికి ఆసీస్ 48 పరుగులు చేసింది.
A sharp catch at short mid wicket by Varun Chakaravarthy ends Josh Philippe’s stay out in the middle.
Arshdeep Singh picks up his first wicket.
Live – https://t.co/Iep4K7ytVn #TeamIndia #AUSvIND #4thT20I pic.twitter.com/8xZT8meA6y
— BCCI (@BCCI) November 6, 2025
ఆ తర్వాతి ఓవర్లోనే ఇంగ్లిస్ అక్షర్ పటేల్ ఓవర్లో బౌల్డ్ కాగా.. దూకుడుగా ఆడుతున్న కంగారూ కెప్టెన్ మిచెల్ మార్ష్(30)ను దూబే ఔట్ చేసి పెద్ద బ్రేకిచ్చాడు. అతడి ఓవర్లో పెద్ద షాట్ ఆడిన మార్ష్ బౌండరీ వద్ద అర్ష్‌దీప్ సూపర్ క్యాచ్‌తో పెవిలియన్ చేరాడు. 70కే మూడు వికెట్లు పడిన వేళ టిమ్ డేవిడ్(14), ఫిలిప్పే(10)లు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ, వీరిద్దరూ స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగారు.