Arshdeep Singh : భారత లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్(Arshdeep Singh) అమెరికా గడ్డపై చరిత్రలో నిలిచిపోయే ప్రదర్శన చేశాడు. టీ20 వరల్డ్ కప్(T20 World Cup) చరిత్రలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన ఇండియన్‌గా రికార్డు సృష్టించాడు. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో 9 పరుగులే ఇచ్చి 4 వికెట్లు తీసి ఔరా అనిపించాడు.
తన సంచలన స్పెల్‌తో స్పిన్ మాంత్రికుడు అశ్విన్(Ashwin) 10 ఏండ్ల క్రితం నెలకొల్పిన రికార్డు అర్ష్‌దీప్ బద్దలు కొట్టాడు. 2014లో ఆస్ట్రేలియాపై అశ్విన్ 11 పరుగులకే 4 వికెట్లు పడగొట్టాడు. పొట్టి వరల్డ్ కప్‌లో 4 వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో హర్భజన్ సింగ్, ఆర్పీ సింగ్, జహీర్ ఖాన్(Zaheer Khan), ప్రజ్ఞాన్ ఓజాలు ఉన్నారు. భజ్జీ 2012లో ఇంగ్లండ్‌పై 4/12.. ఆర్పీ సింగ్ దక్షిణాఫ్రికాపై 4/13.. 2009లో జహీర్ ఐర్లాండ్‌పై 4/19.. ఓజా బంగ్లాదేశ్‌పై 4/21తో మెరిశారు.
Innings Break!
Solid bowling display from #TeamIndia! 👏 👏
4⃣ wickets for @arshdeepsinghh
2⃣ wickets for @hardikpandya7
1⃣ wicket for @akshar2026Stay Tuned as India begin their chase! ⌛️
Scorecard ▶️ https://t.co/HTV9sVyS9Y#T20WorldCup | #USAvIND pic.twitter.com/jI2K6SuIJ5
— BCCI (@BCCI) June 12, 2024
న్యూయార్క్‌లో అమెరికాపై అర్ష్‌దీప్ అదరగొట్టాడు. స్లో పిచ్‌పై బౌన్స్ రాబడుతూ.. బుల్లెట్ బంతులతో పవర్ ప్లేలో రెండు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత డేంజరస్ నితీశ్ కుమార్(27), హర్మీత్ సింగ్()లను ఔట్ చేసి అమెరికా పతనాన్ని శాసించాడు. పాండ్యా సైతం ఓ చేయి వేయడంతో యూఎస్ఏ 110 పరుగులకే పరిమితమైంది.