Freestyle Grand Slam ఫ్రీస్టయిల్ గ్రాండ్‌స్లామ్ టూర్లో భారత గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఎరిగేసి (Arjun Erigaisi) పోరాటం ముగిసింది. తొలి రౌండ్ నుంచి సంచలన విజయాలతో సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన ఈ యువకెరటం టైటిల్‌కు అడుగు దూరంలో ఆగిపోయాడు. ఈ టోర్నీలో సెమీస్‌కు చేరిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన తెలంగాణ కుర్రాడు అర్మేనియాకు చెందిన లెవొన్ అరోనియన్ (Levon Aronian) చేతిలో అనూహ్యంగా కంగుతిన్నాడు.
లాస్ వేగాస్ వేదికగా శనివారం జరిగిన పోరులో గట్టిగానే పోరాడిన అర్జున్ ప్రత్యర్థిని నిలువరించలేకపోయాడు. తొలి గేమ్‌లో అవకాశాలు వచ్చినప్పటికీ సద్వినియోగం చేసుకోలేక 0-2తో ఓటమి పాలయ్యాడు. వరల్డ్ నంబర్ 1 మాగ్నస్ కార్ల్‌సన్‌ను ఓడించి టైటిల్‌పై ఆశలు రేపిన ప్రజ్ఞానంద (R Praggnanandhaa) క్వార్టర్స్‌లోనే వెనుదిరిగిన విషయం తెలిసిందే. ప్రపంచంలోని గ్రాండ్‌మాస్టర్లు హోరాహోరీగా తలపడుతున్న ఈ టోర్నీలో ప్రజ్ఞానంద మరో విజయం సాధించాడు. సెమీస్ అవకాశం చేజార్చుకున్న అతడు మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో అదరగొట్లాడు.
What a historic feat by Arjun Erigaisi. The very talented Grandmaster became the first Indian to storm into the Freestyle Chess Grand Slam Semifinals in Las Vegas.
A proud moment for Indian chess! pic.twitter.com/H79pzRgq1a
— SAI Media (@Media_SAI) July 18, 2025
తనమార్క్ ఆటతో విన్సెంట్ కెయ్మర్(జర్మనీ)ని మట్టికరిపించాడు ప్రజ్ఞానంద . నల్లపావులతో ఆడిన భారత స్టార్ తొలి రౌండ్‌ను డ్రాగా ముగించాడు. ఆ తర్వాతి రౌండ్లో అంతుచిక్కని విధంగా ఆడుతూ 1.5-0.5తో ప్రత్యర్థిని ఓడించాడు. మరోవైపు నార్వే దిగ్గజం కార్ల్సన్ కూడా విక్టరీ కొట్టాడు. ఉజ్బెకిస్థాన్ ప్లేయర్ జవోఖిర్ సిండారవోపై అద్భుత విజయంతో మూడో స్థానం రేసులో నిలిచాడు.